సాక్ష్యం ప్లాప్


Flop talk to saakshyam

బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా నటించిన సాక్ష్యం ఈరోజు ఆలస్యంగా విడుదల అయ్యింది , అయితే రిలీజ్ ఆలస్యం అయినప్పటికీ సినిమా ఏమైనా హిట్ అయితే బాగుండేది కానీ అలా రిలీజ్ అవడమే ఆలస్యం ఇలా ప్లాప్ టాక్ వచ్చేసింది. అసలు సినిమా విడుదల కు ముందే ప్లాప్ టాక్ బాగా స్ప్రెడ్ అయ్యింది. కట్ చేస్తే సినిమా విడుదల అయ్యాక అదే ఫలితం నమోదు అయ్యింది దాంతో బెల్లంకొండ సురేష్ తో పాటుగా బెల్లంకొండ శ్రీనివాస్ ఆశలు కూడా గల్లంతయ్యాయి. ఫస్టాఫ్ బాగానే ఉన్నప్పటికీ, ప్రేక్షకులను అలరించే అంశాలు ఉన్నప్పటికీ సెకండాఫ్ మొత్తం దెబ్బ కొట్టింది సాక్ష్యం చిత్రాన్ని.

బెల్లంకొండ సాయి శ్రీనివాస్ సరసన పూజా హెగ్డే నటించగా విలన్ గా జగపతిబాబు నటించాడు. ఇక ఈ చిత్రాన్ని దాదాపు 40 కోట్ల భారీ బడ్జెట్ తో రూపొందించారు. అభిషేక్ నామా ఈ చిత్రాన్ని నిర్మించగా శ్రీవాస్ దర్శకత్వం వహించాడు. ఈరోజు ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల చేయాల్సి ఉండగా ఆర్ధిక ఇబ్బందులతో కొంత ఆలస్యంగా విడుదల అయ్యింది. దాంతో మార్నింగ్ షోలు అన్ని చోట్లా రద్దయ్యాయి. కొన్ని చోట్ల మ్యాట్నీ లు పడుతుండగా మరికొన్ని చోట్ల సాయంత్రం షోలనుండి ఆటలు ప్రారంభం కానున్నాయి. ఆటల సంగతి పక్కన పెడితే సాక్ష్యం ప్లాప్ అనే ముద్ర పడిపోయింది. ఫస్టాఫ్ బాగున్నా సెకండాఫ్ దొబ్బేసింది దాంతో బయ్యర్లు నష్టపోవడం ఖాయం. అలాగే నిర్మాతకు , నిర్మాత కానీ నిర్మాతకు కూడా చుక్కలు కనిపించడం ఖాయం ఈ దెబ్బతో.

English Title: flop talk to saakshyam