పాపం విజయ్ : సర్కార్ ప్లాప్


Flop talk to vijay's SARKAR

తమిళ స్టార్ హీరో విజయ్ నటించిన సర్కార్ చిత్రం ఈరోజు ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల అయ్యింది . సుమారు 80 దేశాల్లో 3000 థియేటర్ లలో రిలీజ్ అయిన సర్కార్ చిత్రానికి తెలుగునాట పెద్దగా ఓపెనింగ్స్ రాలేదు అలాగే సినిమా టాక్ కూడా బాగోలేదు కాబట్టి ఆ తర్వాతి షోలు కూడా అంతంత మాత్రమే ఫుల్ అవుతున్నాయి . అయితే తమిళనాట మాత్రం ఈ సర్కార్ చిత్రానికి బ్రహ్మాండమైన ఓపెనింగ్స్ లభించాయి . విజయ్ కి అక్కడ తిరుగులేని మాస్ ఇమేజ్ ఉండటంతో ఈ స్థాయి వసూళ్లు వస్తున్నాయి అయితే టాలీవుడ్ లో మాత్రం ప్లాప్ అయ్యింది సర్కార్ చిత్రం . మురుగదాస్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రానికి తెలుగులో అంతగా స్పందన లేదు .

రాజకీయ నేపథ్యంలో తెరకెక్కిన సర్కార్ చిత్రానికి తెలుగులో పెద్దగా పబ్లిసిటీ కూడా చేయలేదు . తెలుగు హక్కులు కొన్నామా ? విడుదల చేస్తున్నామా ? అన్నట్లుగా వ్యవహరించారు దాంతో ఓపెనింగ్స్ లేకుండా పోయాయి . అసలు ఒకదశలో ఈ సినిమా విడుదల అయ్యిందా ? అన్న అనుమానం కూడా నెలకొంది ఎందుకంటే తెలుగు రాష్ట్రాలలో ఎక్కడా అలాంటి సందడి కనిపించలేదు మరి . ఇక సినిమా కూడా దారుణంగా ఉండటంతో సినిమా చూసిన వాళ్ళు అందరు పెదవి విరుస్తున్నారు . సర్కార్ ప్రేక్షకులను మెప్పిస్తుందని అనుకుంటే ప్లాప్ జాబితాలో చేరడంతో నిర్మాతకు అలాగే బయ్యర్లకు నష్టాలు పెద్ద మొత్తంలోనే రానున్నట్లు తెలుస్తోంది .

English Title: Flop talk to vijay’s SARKAR