హైద‌రాబాద్‌లో మారేడుమిల్లి డీప్ ఫారెస్ట్‌?

హైద‌రాబాద్‌లో మారేడుమిల్లి డీప్ ఫారెస్ట్‌?
హైద‌రాబాద్‌లో మారేడుమిల్లి డీప్ ఫారెస్ట్‌?

మెగా డాట‌ర్ కొణిదెల నిహారిక, జొన్న‌ల గ‌డ్డ‌ల చైత‌న్య వివాహం ఉద‌య్‌పూర్‌లోని ఉద‌య్‌విలాస్‌లో అత్యంత వైభ‌వంగా జ‌రిగిన విష‌యం తెలిసిందే. ఈ మెగా ఈవెంట్‌లో మెగా ఫ్యామిలీ స్టార్ హీరోలు, ఫ్యామిలీస్ అంతా పాల్గొని సంద‌డి చేశారు. వీరితో పాటు అల్లు ఫ్యామిలీ కూడా హంగామా చేసింది. ఈ వెడ్డింగ్‌లో బ‌న్నీ స‌తీస‌మేతంగా పాల్గొన్నారు. తాజాగా ఉద‌య్‌పూర్ నుంచి హైద‌రాబాద్ తిరిగి వ‌చ్చారు.

`పుష్ప‌` షూటింగ్ కోస్ం సిద్ధ‌మ‌వుతున్నారు. అయితే ఈ సారి షెడ్యూల్ రాజ‌మండ్రి స‌మీపంలోని మారేడు మిల్లి ఫారెస్ట్‌లో కాకుండా హైద‌రాబాద్‌లోనే చేయ‌బోతున్నారు. గ‌త నెల‌లో `పుష్ప‌` షూటింగ్ మారేడుమిల్లి డీప్ ఫారెస్ట్‌లో మొద‌లైన విష‌యం తెలిసిందే. షూట్ సాఫీగా సాగుతున్న నేప‌థ్యంలో స‌డ‌న్‌గా టీమ్ హైద‌రాబాద్ తిరిగి వ‌చ్చేసింది. కార‌ణంగా టీమ్‌లోని 20 మందికి వైర‌స్ సోక‌డ‌మే.

ఇందులో ఒక యూనిట్ మెంబ‌ర్ చ‌నిపోయార‌ని కూడా వార్త‌లు గుప్పుమ‌న్నాయి. దీంతో టీమ్ అక్క‌డ షూటింగ్ చేయ‌డం అంత శ్రేయ‌స్క‌రం కాద‌ని భావించి తిరిగి హైద‌రాబాద్ వ‌చ్చేసింది. హైద‌రాబాద్‌లోనే డీప్ ఫారెస్ట్‌ని సృష్టిస్తున్నార‌ట‌. అందులో విల‌న్ డెన్ కి సంబంధించిన కీల‌క సెట్‌ని సిద్ధం చేస్తున్నార‌ని, అది పూర్త‌యిన త‌రువాతే రెగ్యుల‌ర్ షూట్ ప్రారంభిస్తార‌ని, బ‌న్నీ ఆ స‌మ‌యం కోసం ఎదురుచూస్తున్నార‌ని తెలిసింది.