
ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ కన్నుమూత
ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్(81) ఈరోజు కన్నుమూశారు . దేశ రాజధాని అయిన ఢిల్లీ రాష్ట్రానికి మూడుసార్లు ముఖ్యమంత్రిగా ఎన్నికైన విశేష అనుభవం షీలా దీక్షిత్ సొంతం . యు పి ఏ చైర్ పర్సన్ సోనియా గాంధీ కి అత్యంత ఆప్తురాలు షీలా దాంతో మూడుసార్లు కూడా ఢిల్లీ ముఖ్యమంత్రిగా సేవలందించారు . ఢిల్లీ లో ఓడిపోయిన తర్వాత గవర్నర్ గా నియమితులయ్యారు షీలా , అయితే 2014 లో మోడీ ప్రధాని అయ్యాక షీలా ని గవర్నర్ పదవి నుండి తప్పించారు .
కాంగ్రెస్ పార్టీలోనే జీవితాంతం సేవలందించిన షీలా చివరకు కాంగ్రెస్ పార్టీ సభ్యురాలిగానే కన్నుమూశారు . గత నెల రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న షీలా దీక్షిత్ 81 ఏళ్ల వయసులో తుదిశ్వాస విడిచారు . షీలా దీక్షిత్ మృతికి ప్రధాని మోడీ తో పాటుగా సోనియా గాంధే తదితర ప్రముఖులు తమ ప్రగాఢ సంతాపాన్ని తెలిపారు .