4 హిట్లు 4 ప్లాప్ లు అందుకున్న విజయ్ దేవరకొండFour hits and four flops for vijay devarakonda

పెళ్లి చూపులు , అర్జున్ రెడ్డి , మహానటి, గీత గోవిందం చిత్రాలతో 4 హిట్లు అందుకున్న విజయ్ దేవరకొండ ద్వారకా , ఏ మంత్రం వేశావే ,ఈ నగరానికి ఏమైంది చిత్రాల తర్వాత ఇప్పుడు నోటా తో నాలుగు ప్లాప్ చిత్రాలను అందుకున్నాడు విజయ్ దేవరకొండ. 2016 నుండి ఇప్పటి వరకు రెండున్నర సంవత్సరాలలో నాలుగు హిట్స్ నాలుగు ప్లాప్స్స్ తో ఉన్నాడు. మధ్యలో ఈ నగరానికి ఏమైంది చిత్రంలో కామియో రోల్ పోషించాడు అది ప్లాప్ దాంతో హిట్స్ కంటే ప్లాప్ జాబితా పెద్దదై పోయింది. ఈ నగరానికి ఏమైంది చిత్రంలో అధితి పాత్ర పోషించడానికి కారణం దాస్యం తరుణ్ భాస్కర్ కావడమే కారణం.

ఇక ఏ మంత్రం వేశావే చిత్రం పెళ్లిచూపులు సమయంలో నటించాడు. అయితే అర్జున్ రెడ్డి విడుదల తర్వాత అనూహ్యంగా విజయ్ దేవరకొండ రేంజ్ పెరిగినప్పటికి ఆ స్థాయిలో సినిమా లేకపోవడంతో అది ప్లాప్ అయ్యింది. ఇక ద్వారకా సినిమాపై ఎన్నో ఆశలు పెట్టుకొని చేసాడు కానీ అది కూడా ప్లాప్ అయ్యింది.సంచలన విజయం సాధించిన మహానటి చిత్రంలో కూడా గెస్ట్ గా నటించాడు. ఇక ఇప్పుడేమో నోటా చిత్రం పెద్ద ప్లాప్ అయ్యింది. నిన్న విడుదలైన ఈ నోటా చిత్రానికి ఉదయపు ఆట నుండే డివైడ్ టాక్ వచ్చింది. నోటా పెద్ద హిట్ అవుతుందని , తమిళ్ లో కూడా మంచి మార్కెట్ ఏర్పడుతుందని ఆశించాడు కానీ పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. అయితే విజయ్ కున్న క్రేజ్ వల్ల ఓపెనింగ్స్ మాత్రం బాగానే వచ్చాయి.

English Title: Four hits and four flops for vijay deverakonda