నాలుగు సినిమాలు రిలీజ్ మరి హిట్ అయ్యేది ఏదో ?


Four movies in race on dec 7th

ఈనెల 7న నాలుగు సినిమాలు విడుదల అవుతున్నాయి . అయితే ఆ నాలుగు సినిమాలలో ఏది హిట్ అవుతుందో మాత్రం డైలమాలో ఉంది పరిస్థితి . అసలు 6 లేక 7 సినిమాలు విడుదల కావాల్సి ఉండే కానీ రెండు మూడు సినిమాలు వెనకడుగు వేసాయి దాంతో ఈనెల 7న కవచం , శుభలేఖ ప్లస్ లు , సుబ్రమణ్యపురం , నెక్స్ట్ ఏంటి చిత్రాలు విడుదల అవుతున్నాయి . కవచం చిత్రంలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా నటించగా కాజల్ అగర్వాల్ , మెహరీన్ హీరోయిన్ లుగా నటించారు . నెక్స్ట్ ఏంటి చిత్రంలో తమన్నా , సందీప్ కిషన్ లు నటించారు ఇది బోల్డ్ సినిమా అనే ప్రచారం సాగుతోంది .

సుమంత్ నటించిన సుబ్రమణ్యపురం సినిమా కూడా వస్తోంది , ఈ సినిమాపై సుమంత్ ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు ఈషా రెబ్బా కథానాయికగా నటించింది . ఇక కొత్తవాళ్లతో నిర్మించిన చిత్రం శుభలేఖ +లు కూడా ఈనెల 7నే విడుదల అవుతోంది . యువత మనోభావాలను తెరకెక్కించిన ఈ చిత్రం పై నమ్మకంతో బెల్లం రామకృష్ణారెడ్డి విడుదల చేస్తున్నాడు . మరి ఈ నాలుగు చిత్రాల్లో ఏది ప్రేక్షకాదరణ పొందుతుందో చూడాలి .

English Title: Four movies in race on dec 7th