నాలుగు సినిమాలు రిలీజ్ ఒకటే హిట్


four movies released but

ఈరోజు నాలుగు సినిమాలు విడుదల కాగా అందులో ఒక్క సుధీర్ బాబు చిత్రానికి మాత్రమే హిట్ టాక్ వచ్చింది మిగతా మూడు సినిమాలు ప్లాప్ బాట పట్టాయి . సుధీర్ బాబు హీరోగా నటిస్తూ నిర్మించిన చిత్రం నన్ను దోచుకుందువటే రిలీజ్ కాగా ఈ చిత్రానికి పాజిటివ్ టాక్ వచ్చింది . ఇక దీనితో పాటుగా తమిళ స్టార్ హీరో నటించిన విక్రమ్ నటించిన ద్విభాషా చిత్రం సామి కూడా విడుదల అయ్యింది అయితే 2004 లో వచ్చిన సామి పెద్ద హిట్ కావడంతో దానికి సీక్వెల్ కావడంతో తప్పకుండా హిట్ అవుతుందని అనుకున్నారు కానీ ఆ రేంజ్ లో సినిమా లేకపోవడంతో ప్లాప్ జాబితాలో చేరినట్లే అంటున్నారు .

ఇక వీటితో పాటుగా అర్జున్ హీరోగా నటించిన కురుక్షేత్రం కూడా విడుదల అయ్యింది . ఇది అర్జున్ కు 150 వ చిత్రం కావడంతో ఈ సినిమాపై ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు అర్జున్ అలాగే ప్రేక్షకులు కూడా వాళ్ళ అంచనాలకు తగ్గట్లుగా లేకపోవడంతో అప్పుడే ప్లాప్ టాక్ స్ప్రెడ్ అయ్యింది . ఇక మరో సినిమా విజయ్ మాస్టర్ తనయుడు హీరోగా నటించిన ఈమాయ పేరేమిటో కూడా ప్లాప్ అయ్యింది . అసలు ఈ సినిమా ఒకటి ఉన్నట్లుగా కూడా తెలీదు . మొత్తానికి ఈరోజు విడుదల అయిన నాలుగు సినిమాల్లో సుధీర్ బాబు చిత్రానికి మాత్రమే పాజిటివ్ టాక్ వచ్చింది .

English Title: four movies released but