నాలుగు సినిమాలు పోటీ పడుతున్నాయ్


 Four movies releasing on december 14 th

ఓడియన్ , భైరవగీత , హుషారు , అనగనగా ఓ ప్రేమకథ చిత్రాలు డిసెంబర్ 14న రిలీజ్ కి సిద్ధమయ్యాయి . ఈ నాలుగు సినిమాలు కూడా విజయం కోసం పోటీ పడుతున్నాయి . ఓడియన్ సినిమాలో మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ నటించడంతో ఆ సినిమాపై కాస్త అంచనాలు ఎక్కువగా ఉన్నాయి అయితే మిగతా మూడు సినిమాలు మాత్రం అంతగా క్రేజ్ లేకుండా పోయింది . అయితే సినిమాలు బాగుంటే సక్సెస్ కొట్టొచ్చు లేదంటే షరా మాములుగా ప్లాప్ జాబితాలో చేరతాయి  అని చెప్పొచ్చు .

హుషారు సినిమా అంతా కొత్తవాళ్లతో రూపొందింది , అనగనగా ఓ ప్రేమకథ కూడా కొత్తవాళ్లతో రూపొందిన చిత్రం . ఇక భైరవగీత అడల్ట్ కంటెంట్ తో తెరకెక్కింది . ఈ సినిమా పలుమార్లు వాయిదాపడింది , మొత్తానికి అన్ని అడ్డంకులు అధిగమించి ఈనెల 14న విడుదల అవుతోంది . అయితే ఈ నాలుగు చిత్రాలు కూడా పెద్దగా ప్రభావం చూపించే సినిమాలు అయితే కాదు , ఒకవేళ టాక్ బాగుంటే హిట్ కొట్టొచ్చు .

English Title:  Four movies releasing on december 14 th