చంద్రబాబు కి షాక్ ఇచ్చిన నలుగురు ఎంపీలు

 TDP Rajyasabha mps ready to join bjp
Four TDP Rajyasabha mps ready to join bjp

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కి దెబ్బ మీద దెబ్బ పడుతోంది . ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో చిత్తుగా ఓడిపోవడంతో తెలుగుదేశం పార్టీ పరిస్థితి అగమ్యగోచరంగా ఉండగా తాజాగా తెలుగుదేశం పార్టీకి చెందిన నలుగురు రాజ్యసభ సభ్యులు పరోక్షంగా బీజేపీ తీర్థం పుచ్చుకోవడానికి రెడీ అయ్యారు . ఇక ఈ నలుగురు రాజ్యసభ సభ్యులు కూడా చంద్రబాబు కు బాగా నమ్మిన బంటులు కావడం విశేషం .

నలుగురు రాజ్యసభ సభ్యులలో సుజనా చౌదరి , సీఎం రమేష్ , టీజీ వేంకటేశ , గరికపాటి మోహన్ రావు లు ఉన్నారు . రాజ్యసభలో తెలుగుదేశం పార్టీకి మొత్తం ఆరుగురు రాజ్యసభ సభ్యులు ఉండగా అందులో నలుగురు కాషాయం కు మద్దతు తెలిపారు . ఇక మరో ఇద్దరిని కూడా బీజేపీ లోకి తెచ్చుకునేలా ప్లాన్ చేస్తున్నారు . ఇప్పటికే తెలంగాణలో తెలుగుదేశం పార్టీ తుడిచి పెట్టుకుపోయింది , ఇక ఆంధ్రప్రదేశ్ లో అలాగే ఉంది పార్టీ పరిస్థితి . అసెంబ్లీ లో 23 మంది ఎం ఎల్ ఏ లున్నారు తెలుగుదేశం కు అయితే 5 ఏళ్ల పాటు వాళ్ళని కాపాడుకోవడం కష్టంగానే కనబడుతోంది . ఇందులో 15 మందికి పైగా అటు బీజేపీ తోనూ ఇటు జగన్ పార్టీ తోనూ టచ్ లో ఉన్నారట ఎం ఎల్ ఏ లు .