రాన‌నుకున్నావా.. రాలేన‌ను కున్నావా..?రాన‌నుకున్నావా.. రాలేన‌ను కున్నావా..?
రాన‌నుకున్నావా.. రాలేన‌ను కున్నావా..?

` రాన‌నుకున్నావా.. రాలేన‌నుకున్నావా..?.. `ఇంద్ర‌` చిత్రంలో చిరు చెప్పిన ఈ డైలాగ్‌కు థియేట‌ర్ల‌న్నీ చ‌ప్ప‌ట్ల‌తో, విజిల్స్‌తో మారుమ్రోగిపోయాయి. ఇన్నేళ్ల త‌రువాత మ‌ళ్లీ ఆ డైలాగ్‌ని మెగాస్టార్ చిరంజీవి ట్విట్ట‌ర్ వేదిక‌గా తన మిత్రుడు, స‌మ‌కాలీకుడు అయిన క‌లెక్ష‌న్ కింగ్ మోహ‌న్ బాబుపై వాడ‌టం ఆస‌క్తిక‌రంగా మారింది. మెగాస్టార్ చిరంజీవి ఉగాది సంద‌ర్భాన్ని పుర‌స్క‌రించుకుని సోష‌ల్‌మీడియా ట్విట్ట‌ర్‌లోకి ఎంట‌రైన విష‌యం తెలిసిందే.

చిరు ఎంట‌ర్ కావ‌డంతో ప‌లువురు సినీ ప్ర‌ముఖులు, స్టార్స్ ఆయ‌న‌కు ఆత్మీయంగా సోష‌ల్ మీడియాలోకి స్వాగ‌తం ప‌లికారు. వారిలో మోహ‌న్‌లాల్‌, ఎన్టీఆర్‌తో పాటు చాలా మంది స్టార్‌లు చిరుకు స్వాగ‌తం ప‌లికిన వారిలోవున్నారు. అయితే మోహ‌న్‌బాబు కూడా `మిత్ర‌మా వెల్క‌మ్` అంటూ  చిరుకు స్వాగ‌తం ప‌లికారు. అయితే దీనికి చిరు త‌న‌దైన స్టైల్లో స్పందించ‌డం ఆక‌ట్టుకుంటోంది. `రాన‌నుకున్నావా.. రాలేన‌నుకున్నావా..? అని `ఇంద్ర‌` చిత్రంలోని డైలాగ్‌తో స‌మాధానం ఇచ్చారు.

వెంట‌నే తేరుకున్న మోహ‌న్‌బాబు `ఈసారి కౌగిలించుకున్న‌ప్పుడు చెబుతాను`అంటూ క‌న్ను కొడుతున్న ఎమోజీని జ‌త చేయ‌డం నెటిజ‌న్స్‌ని, వీరిద్ద‌రి ఫ్య‌న్స్‌ని ఆక‌ట్టుకుంటోంది. ఈ సంభాష‌ణ సోష‌ల్ మీడియాలో వైర‌ల్ కావ‌డంతో అభిమానులు మాత్రం ఇద్ద‌రిలో ఎవ‌రూ త‌గ్గ‌డం లేదుగా .. మీరు ఇఆ వుంటేనే మాకు అనందం అని ట్వీట్లు చేస్తున్నారు. ఇదిలా వుంటే క‌రోనా ర‌క్క‌సి కార‌ణంగా క‌నీస అవ‌స‌రాల కోసం ఇడ్డందులు ప‌డుతున్న సినీ కార్మికుల కోసం చిరు కోటి రూపాయ‌లు అంద‌జేస్తున్న‌ట్టు ప్ర‌క‌టించారు.

Credit: Twitter