నాగ్ కు అందమైన పంచ్ ఇచ్చిన రేఖ


నాగ్ కు అందమైన పంచ్ ఇచ్చిన రేఖ
నాగ్ కు అందమైన పంచ్ ఇచ్చిన రేఖ

నిన్న రాత్రి ఏఎన్నార్ జాతీయ అవార్డుల ప్రధానోత్సవం అట్టహాసంగా జరిగింది. వేడుకకు చిరంజీవి ముఖ్య అతిధిగా విచ్చేసి అవార్డును అందజేశారు. ఏఎన్నార్ జాతీయ అవార్డుల పేరిట ప్రతీ ఏడాది సినిమాల్లో విశేష సేవలందించిన ఒకరికి ఈ అవార్డును ప్రదానం చేస్తూ వస్తున్నారు. 2006లో మొదలైన ఈ అవార్డులను మొదట దేవ్ పటేల్ అందుకున్నారు. 2017లో రాజమౌళిని వరించిన ఈ అవార్డు 2018లో అనివార్య కారణాల వల్ల ఎవరికీ ఇవ్వలేదు. అయితే రీసెంట్ గా మళ్ళీ అవార్డులను ప్రకటించాడు నాగార్జున. 2018 సంవత్సరానికి గాను దివంగత నటి శ్రీదేవి, 2019లో అలాంటి అందాల తార రేఖకు ఈ అవార్డును అందజేస్తున్నట్లు నాగార్జున ప్రకటించిన సంగతి తెల్సిందే.

ఆ సందర్భంగా నిన్న అవార్డులను విజేతలకు అందజేశారు. శ్రీదేవికి వచ్చిన అవార్డును ఆమె భర్త బోణీ కపూర్ అందుకున్నారు. ఇక రేఖకు అవార్డును అందించే సమయంలో సరదా సంఘటనలు జరిగాయి. అన్నిటికంటే ముందు రేఖ తెలుగులో మాట్లాడడం అందరినీ ఆశ్చర్యపరిచింది. అనర్గళంగా ఇప్పుడు తెలుగు వారు మాట్లాడడానికి ఇబ్బంది పడుతూ ఇంగ్లీష్ పదాలతో కవర్ చేస్తూ మాట్లాడే విధంగా కాకుండా చాలా స్పష్టంగా రేఖ తెలుగులో మాట్లాడడం అందరినీ ఆశ్చర్యపరిచింది. అసలు రేఖకు ఇంత తెలుగు వచ్చు అన్న సంగతి ఈ తరం వారికి తెలియదు.

నాగార్జున స్టేజి మీద వ్యాఖ్యానిస్తూ రేఖ, శ్రీదేవి ఇద్దరూ తెలుగువాళ్లు అవ్వడం గర్వకారణంగా ఉందని అన్నాడు. అప్పుడు రేఖతో మీ అందానికి రహస్యం చెప్పమని అడగ్గా, అది చూసే వాళ్ళ బట్టి ఉంటుంది. మీరు ఎలా అందంగా ఉన్నారో నేను అలాగే ఉన్నాను అని రేఖ అనడం నవ్వులు పూయించింది. అలాగే మరో ప్రశ్న అడుగుతుంటే ఇది అవార్డుల కార్యక్రమంలా లేదని, ఏదో ప్రశ్నల కార్యక్రమంలా ఉందని చెప్పుకొచ్చింది. తర్వాత నాగార్జున శ్రీదేవితో నాలుగు సినిమాల్లో నటించాను.. మీతో కూడా కలిసి నటించాలని ఉంది అని రేఖను అడగ్గా అక్కడే ఉన్న చిరంజీవి మైక్ అందుకుని నాగ్ నువ్వు డబల్ రోల్ చేస్తే రేఖ నీ పక్కన నటిస్తారు అని చెప్పాడు. ఈ సమాధానికి అందరూ కరతాళధ్వనులతో తమ హర్షం వ్యక్తం చేసారు.

అలాగే రేఖ గురించి మాట్లాడుతూ రేఖ తొలి సినిమా తెలుగులోనే వచ్చిందని, రంగుల రాట్నమే కదా అని ప్రశ్నించగా దానికి రేఖ కాదు, అది నా తొలి సినిమా కాదు. నా తొలి సినిమా, ఆఖరి సినిమా ఏంటనేది ఎవరికీ తెలీదు. ఆఖరి సినిమా ఏంటనేది నాకు కూడా గుర్తులేదు. కానీ నా మొదటి సినిమా తెలుగులో ఇంటిగుట్టు అని చెప్పారు. దీనికి నాగ్ ఆశ్చర్యంగా మొహం పెట్టగా, వెంటనే రేఖ అందులో నేను 1 సంవత్సరం పాపగా నటించాను అని చెప్పగా నాగార్జున గట్టిగా ఇది తూచ్, అంత చిన్న ఏజ్ లో చేసినది కౌంట్ అవ్వదు అని చెప్పగానే, ఆమె అందుకుని ఎందుకు అవ్వదు.. అందులో నేను ఎంతో బాగా నటించాను అంటూ ఫన్నీగా ఎండ్ చేసింది. మొత్తంగా నిన్న ఈ కార్యక్రమం సరదాసరదాగా సాగిపోయింది.