రోడ్డు ప్రమాదంలో గబ్బర్ సింగ్ నటుడికి గాయాలు


పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన గబ్బర్ సింగ్ లో నటించిన ” ఆంజనేయులు ” అనే నటుడు రోడ్డు ప్రమాదంలో గాయపడ్డాడు . గబ్బర్ సింగ్ లో గ్యాంగ్ లో ఒకడిగా , హీరో రాజశేఖర్ ని ఇమిటేట్ చేసే నటుడు అయిన ఆంజనేయులు హైదరాబాద్ లోని ఇందిరానగర్ లో నివాసం ఉంటున్నాడు . తన భార్య తో కలిసి గచ్చిబౌలి వైపు బైక్ పై వెళ్తుండగా వెనుక నుండి వేగంగా వచ్చిన కారు ఆంజినేయులు బైక్ ని ఢీ కొట్టడంతో మోకాలు కి అలాగే చేతికి గాయాలయ్యాయి .

మొకాలుకి గాయం కావడంతో వెంటనే నడవలేని పరిస్థితి కావడంతో పోలీసులకు ఫిర్యాదు చేసాడు . కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాపు చేస్తున్నారు . ఈ రోడ్డు ప్రమాదంలో ఆంజనేయులు తో పాటుగా ఆంజనేయులు భార్య కు కూడా స్వల్ప గాయాలయ్యాయి . ఆంజనేయులు గబ్బర్ సింగ్ లోనే కాకుండా పలు చిత్రాల్లో నటించాడు .