గద్దలకొండ గణేష్ 10 డేస్ కలెక్షన్స్ రిపోర్ట్Gaddalakonda Ganesh 10 days collections
Gaddalakonda Ganesh 10 days collections

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటించిన గద్దలకొండ గణేష్ విడుదలై 10 రోజులు పూర్తయింది. మరో రెండు రోజుల్లో మెగాస్టార్ చిరంజీవి నటించిన భారీ బడ్జెట్ చిత్రం సైరా నరసింహారెడ్డి విడుదలవుతోంది. అయితే ఇప్పటికే గద్దలకొండ గణేష్ చిత్రాన్ని కొన్న బయ్యర్లందరూ సేఫ్ జోన్ లోకి వెళ్లిపోయారు.

సీడెడ్, గుంటూరు, కృష్ణ బయ్యర్లు మాత్రం ఇంకా సేఫ్ అవ్వలేదు. అయితే రేపో, ఎల్లుండో వారు కూడా లాభాల బాట పడతాడని అంటున్నారు. మొత్తానికి తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రం 10 రోజులకు 20 కోట్ల షేర్ వసూలు చేయగా, ప్రపంచవ్యాప్తంగా 23 కోట్ల షేర్ వచ్చింది. 25 కోట్ల బిజినెస్ చేసిన ఈ చిత్రం ఒక్క ఓవర్సీస్ లో మాత్రమే నష్టాల బాటలో ఉంది.