
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, హరీష్ శంకర్ దర్శకత్వంలో రూపొందించిన చిత్రం గద్దలకొండ గణేష్ (వాల్మీకి). తొలి రోజు నుండే మంచి టాక్ ను తెచ్చుకున్న ఈ చిత్రం భారీ హిట్ ను అందుకుంటుందని ఆశించారు. దీనిని కమర్షియల్ క్లాసిక్ అంటూ నిర్మాతలు సంబోధించారు కానీ ఈ చిత్రానికి అంత సినిమా అయితే లేదు.
బయ్యర్లందరూ దాదాపుగా సేఫ్ జోన్ కు చేరుకున్నారు. ఓవర్సీస్ డిస్ట్రిబ్యూటర్ కు భారీగా నష్టాలొచ్చాయ్. ఇక ఒకటి రెండు ప్రాంతాలు తప్ప మిగతా బయ్యర్లంతా సేఫ్ జోన్ కు చేరుకున్నారు. అలాగని భారీ లాభాలను వెనకేసుకోలేదు. ఈ చిత్రానికి 25 కోట్ల మేర బిజినెస్ జరిగింది. రెండు వారాలు ముగిసేసరికి తెలుగు రాష్ట్రాల నుండి దాదాపు 21 కోట్లు వసూలైంది.
ఇక ప్రపంచవ్యాప్త వసూళ్లను పరిగణలోకి తీసుకుంటే గద్దలకొండ గణేష్ 25 కోట్లకు అటూ ఇటూ ఉంటుంది. మొత్తానికి వరుణ్ తేజ్ మరో హిట్ ను తన ఖాతాలో వేసుకున్నట్లే కాకపోతే నిర్మాతలు చెప్పినట్లు క్లాసిక్ అయితే కాదిది.