గద్దలకొండ గణేష్.. హిట్ దిశగా సాఫీగా..


Gaddalakonda Ganesh Collections
గద్దలకొండ గణేష్.. హిట్ దిశగా సాఫీగా..

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటించిన తాజా చిత్రం గద్దలకొండ గణేష్ పాజిటివ్ రివ్యూలతో డీసెంట్ కలెక్షన్స్ ను సాధించింది. రివ్యూలు పాజిటివ్ గా రావడంతో పాటు ప్రేక్షకుల స్పందన కూడా బాగుండటంతో గద్దలకొండ గణేష్ చిత్రం హిట్ దిశగా పయనిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా మొదటి వారాంతంలో గద్దలకొండ గణేష్ 15 కోట్లు వసూలు చేసింది. ఇది చాలా మంచి నెంబర్ అని చెప్పవచ్చు.

ఇక సోమవారం వసూళ్లు కూడా ఆశాజనకంగా ఉండడంతో చిత్ర బృందం ఊపిరి పీల్చుకుంది. ఏ చిత్రానికైనా సోమవారం అనేది అత్యంత కీలకమైంది. ఆ రోజు వసూళ్లు బాగుంటే సినిమా హిట్ అన్న నమ్మకం ఏర్పడుతుంది. గద్దలకొండ గణేష్ నాలుగో రోజు 1.30 కోట్లు వసూలు చేసింది. అందులో నైజాం నుండే దాదాపు 70 లక్షల దాకా ఉండటం విశేషం.

మొత్తంగా చూసుకుంటే నాలుగు రోజులకు కలిపి గద్దలకొండ గణేష్ దాదాపు 17 కోట్ల షేర్ సాధించింది. 25 కోట్లకు బిజినెస్ జరిగిన ఈ చిత్రం రెండో వారాంతం ముగిసేనాటికి లాభాల్లోకి రానుంది. అక్టోబర్ 2 సైరా వచ్చేవరకూ పెద్దగా పోటీ లేకపోవడంతో గద్దలకొండ గణేష్ చిత్రాన్ని కొనుగోలు చేసిన బయ్యర్లకు లాభాల పంట పండినట్లే.