గద్దలకొండ గణేష్ లేటెస్ట్ యూఎస్ కలెక్షన్స్


Gaddalakonda Ganesh latest us collections
Gaddalakonda Ganesh latest us collections

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటించిన గద్దలకొండ గణేష్ చిత్రానికి అంతటా మంచి రెస్పాన్స్ వచ్చింది. రివ్యూయర్ల నుండి సాధారణ ప్రేక్షకుల వరకూ ఈ చిత్రం బాగుందని అన్నారు. అయితే తెలుగు రాష్ట్రాల్లో మంచి రన్ ప్రదర్శిస్తున్న ఈ చిత్రం యూఎస్ లో మాత్రం చాలా సాధారణ కలెక్షన్స్ ను సాధిస్తోంది. ప్రీమియర్లతో కేవలం $ 84,981 డాలర్స్ ను సాధించిన ఈ చిత్రం, శుక్రవారం $ 79,753 డాలర్స్ ను వసూలు చేసింది.

శనివారం కలెక్షన్స్ కొంచెం మెరుగుపడింది. రాత్రి 9 గంటలకు రిపోర్ట్ అయిన దాని ప్రకారం మొత్తం 127 లొకేషన్స్ నుండి ఈ చిత్రం $ 84,348 కలెక్ట్ చేయగలిగింది. మొత్తంగా చూసుకుంటే గద్దలకొండ గణేష్ $ 249,082 డాలర్స్ సాధించింది. ఇది ఓ మోస్తరు కలెక్షన్స్ అనే చెప్పాలి. ఫిదా, తొలిప్రేమ, ఎఫ్ 2 చిత్రాలతో యూఎస్ లో మంచి మార్కెట్ ఏర్పరుచుకున్న వరుణ్, గద్దలకొండ గణేష్ తో ఇక్కడ వెనకబడ్డాడు. అయితే ఇది పూర్తిగా మాస్ చిత్రం కాబట్టి యూఎస్ లో కొంత ఆదరణ తక్కువుంటుందని విశ్లేషకులు చెబుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో మాత్రం గద్దలకొండ గణేష్ హిట్ దిశగా సాగుతోంది.