సినిమా హిట్ అవ్వడం.. డిలీట్ సీన్స్ పెట్టడం.. ఇదో వెరైటీ….


Gaddalakonda Ganesh movie deleted scenes
Gaddalakonda Ganesh movie deleted scenes

సినిమా ఇంకొక నెలలో, వారంలో, రోజులో, గంటలో విడుదల అవుతుండగా ఎక్కడాలేని ప్రమోషన్స్ చేస్తారు మన తెలుగు నిర్మాతలు, దర్శకులు, కథానాయకులు, నాయికలు. ఇలా వారి సహకారం వాళ్ళ సినిమా హిట్ అయ్యితే వాళ్ళు చేసినా కష్టానికి ఫలితం దక్కుతుంది. లేదా సినిమా ఫెయిల్ అయితే ఆ సినిమా, వాళ్ళ ఫలితం రెండు వృధా అవుతాయి.

ఇది ఒక పక్క అయితే, సినిమా విడుదల అయ్యి మంచి హిట్ అయ్యిన తర్వాత ఆ సినిమాల నుండి డిలీట్ సీన్స్ అని యూట్యూబ్ లో వదులుతున్నారు. ఇది ఇంకొక రకం వెరైటీ అంటున్నారు నెటిజన్లు. నిజానికి సినిమా హిట్ అయ్యిన కూడా ఇలాంటి ప్రమోషన్స్ ఎందుకు అంటే ఆ డిలీట్ సీన్స్ సరిగ్గా రాకపోవడం, లేదా పెడితే సినిమాకి మైనస్ అని చెప్పి ఎడిటింగ్ లో లేపేసి హిట్ అయిన తర్వాత యూట్యూబ్ లో పెడుతున్నారు.

ఈ సంవత్సరం ‘ఎఫ్ 2’ దగ్గర నుండి ‘మహర్షి‘, ‘ఎవరు’ , ‘బ్రోచేవారెవరురా‘ అబ్బో చూసుకుంటే పెద్ద లిస్ట్ ఉంది. అలా ఆ సినిమాల నుండి డిలీట్ సీన్స్ అని చెప్పి యూట్యూబ్ లో రిలీజ్ చేసారు, అవి మనం చూసేసాం కూడా. ఇప్పుడు హరీష్ శంకర్, వరుణ్ తేజ్ కాంబినేషన్ లో వచ్చిన ‘గద్దలకొండ గణేష్’ సినిమా నుండి కూడా 3 డిలీట్ సీన్స్ వచ్చాయి.

మొదటి సీన్ ఏమో ‘గద్దలకొండ కి గణేష్ బలం కాదు… గణేష్ మాత్రమే గద్దలకొండ కి బలం’ అని చెప్పిన ఆ డైలాగు రెండు రోజుల క్రితమే చూసాం. నిన్న ఇంకొక డిలీట్ సీన్ రిలీజ్ అయ్యింది. అందులో ఎమోషనల్ గా ‘పూజహెగ్డే’ తో చెప్పే డైలాగు ఉంది. మరి ఈ సన్నివేశాన్ని పెట్టకపోవడానికి కారణం ఏంటి అని కింద కామెంట్స్ రూపంలో జనాలు అడుగుతున్నారు. చూద్దాం మరి ఎవరన్న సమాధానం చెప్తారో? లేదో?