మహేష్ బావ టిడిపికి షాక్ ఇవ్వనున్నాడా


galla jayadev eyes on ysr congress

మహేష్ బాబు బావ గుంటూరు పార్లమెంట్ సభ్యులు గల్లా జయదేవ్ తెలుగుదేశం పార్టీ కి షాక్ ఇవ్వనున్నట్లు ప్రచారం సాగుతోంది . అధికార తెలుగుదేశం పార్టీ తరుపున పార్లమెంట్ కు గుంటూరు తరుపున ప్రాతినిధ్యం వహిస్తున్నాడు గల్లా జయదేవ్ . గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీలో చేరాడు గల్లా జయదేవ్ , అయితే 2019 లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాదు అంటూ పెద్ద ఎత్తున ప్రచారం సాగుతోంది , అంతేకాదు జగన్ ముఖ్యమంత్రి అవ్వడం ఖాయమని వై ఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని ప్రచారం సాగడంతో తెలుగుదేశం పార్టీ ని వీడి జగన్ పార్టీలో చేరనున్నాడు అని గుసగుసలు మొదలయ్యాయి .

ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా రాకపోవడంతో ప్రజలు ఆగ్రహంగా ఉన్నారని అందుకు తెలుగుదేశం పై సానుకూలంగా లేరని నమ్ముతున్నాడు గల్లా జయదేవ్ . అంతేకాదు చంద్రబాబు ప్రభుత్వం పై కేంద్ర ప్రభుత్వం ఆగ్రహంగా ఉండగా , భారతీయ జనతా పార్టీ నాయకులు పెద్ద ఎత్తున చంద్రబాబు ప్రభుత్వం పై అవినీతి ఆరోపణలు చేస్తున్నారు దాంతో గల్లా జయదేవ్ డైలమాలో పడ్డాడట . అలాగే తనకు పిల్లనిచ్చిన మామ సినీ నటుడు కృష్ణ మొదటి నుండి కాంగ్రెస్ పార్టీ కి సేవ చేస్తున్నాడు ఇక ఇప్పుడేమో జగన్ ముఖ్యమంత్రి అవ్వడం ఖాయమని అంటున్నాడు దాంతో గల్లా జయదేవ్ తెలుగుదేశం పార్టీ కి షాక్ ఇచ్చి వై ఎస్సార్ కాంగ్రెస్ పార్టీ లోకి వెళ్లడం ఖాయమని ప్రచారం సాగుతోంది . అయితే ఇంతకుముందు ఇలాంటి కథనాలే వస్తే గల్లా జయదేవ్ స్పందించాడు పార్టీ ని వీడటం లేదని చెప్పాడు , మరి ఇప్పుడు ఈ వార్తలపై స్పందిస్తాడా ? లేదా ? చూడాలి .