హీరోగా జూనియర్ గల్లా

galla jayadevs son launching as hero
galla jayadevs son launching as hero

అతడు సినిమాలో మన త్రివిక్రమ్ అప్పుడే ఒక మాట వేసి ఉంచాడు.

“ఏముంది రా … చదువుకున్నోళ్ళు అందరూ టీచర్లు అయిపోయారు.చదువు రాని వాళ్ళు అందరూ స్కూళ్ళు పెట్టేసారు అని, కొంచెం ఆ పంచ్ ని మార్చుకుంటే, బాగా డబ్బునోళ్ళ పిల్లలు ఏం చేస్తారు రా .. అంటే అయితే వ్యాపారం లేకపోతే సినిమాల లోనో, రాజకీయంగానో తమ లక్కు టెస్ట్ చేసుకుంటారు. ఏదీ ఏమైనా ఈ డబ్బునోల్లకి  హార్ట్ స్ట్రోక్ లేట్ అవుతుందేమో కానీ, సన్ స్ట్రోక్ మాత్రం ఖచ్చితంగా లేట్ అవ్వదు.

ఇప్పుడు అసలు మ్యాటర్ లోకి వస్తే అటు వ్యాపారంలో, ఇటు రాజకీయంలో సక్సెస్ అయ్యి, రాజకీయ వేత్త గల్లా జయదేవ్ తన కొడుకు గల్లా అశోక్ ని సినిమాల లోకి దించుతున్నారు. భలే మంచి రోజు, శమంతక మణి సినిమాలతో టాలీవుడ్ లో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న యువ దర్శకుడు శ్రీ రాం ఆదిత్య డైరెక్షన్ లో సినిమా ను ప్రారంభించనున్నారు.

శ్రీ రాం ఆదిత్య ఇటీవలే నాగార్జున మరియు నాని కాంబినేషన్ లో దేవదాసు అనే సినిమా చేసాడు. సినిమా ఫ్లాప్ అయినా, పెద్ద స్టార్ లను ఏ మాత్రం భయపడకుండా, బాగా హ్యాండిల్ చేసాడనే మంచిపేరు వచ్చింది

హీరో కొత్త కాబట్టి, డబ్బులకు డాడీ దగ్గర లోటు లేదు కాబట్టి ఏ పూరినో, వినాయక్ తోనో లాంచ్ చెయ్యకుండా ఇదేమిట్రా అంటే, అప్పుడు బయటపడింది అసలు మ్యాటర్.

ఆల్రెడీ మనోడితో గత సంవత్సరం రామానాయుడు స్టుడియోలో ఒక సినిమా స్టార్ట్ చేసి మధ్యలో ఆపేశారు. ఆ సినిమా పేరు అదే నువ్వు – అదే నేను. ఈ సినిమా కొన్ని అనివార్య కారణాల వల్ల ఆగిపోయింది అని, కవర్ చేసినా, సీనియర్ గల్లా బొమ్మరిల్లు డాడీ లాగా అతి జోక్యమే అందుకు కారణం అని తెలుస్తోంది.

ఇప్పటికే కృష్ణ గారి కాంపౌండ్ నుంచి, మహేష్ , సుదీర్ బాబు, మంజుల వంటి వాళ్ళు ఉన్నారు. మహేష్ బాబు తన బావకి ఎలాగు full support అని, గల్లా ఫ్యామిలీ ధైర్యం.

మరి, జూనియర్ గల్లా టాలీవుడ్ లో నిలబడతాడా.? లేక మంచు ఫ్యామిలీ బ్యాచ్ లాగా అతి జాగ్రత్త వల్ల బిస్కెట్ అవుతాడో wait & see.