గేమ్ ఓవర్ రివ్యూ


game over review rating
game over review rating

నటీనటులు : తాప్సీ 
సంగీతం: రాన్ ఈథాన్ యోహాన్
ఛాయాగ్రహణం : వసంత్
నిర్మాత: శశికాంత్
దర్శకత్వం: అశ్విన్ శరవణన్ 
రేటింగ్ : 3.5/5
విడుదల తేదీ : 14 జూన్ 2019

గతకొంత కాలంగా విభిన్న కథా చిత్రాలను చేస్తున్న తాప్సీ పన్ను తాజాగా గేమ్ ఓవర్ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ సినిమా ప్రేక్షకులను అలరించేలా ఉందా ? లేదా ? తెలియాలంటే కథ లోకి వెళ్లాల్సిందే.

కథ :

గేమ్ ప్లానర్ అయిన  స్వప్న (తాప్సీ )  టాటు వేయించుకుంటుంది. అయితే ఆ టాటు వేయించుకున్న తర్వాత తన జీవితంలో అనేక సమస్యలు వచ్చి పడతాయి. సరిగ్గా అదే సమయంలో హైదరాబాద్ మహానగరంలో వరుసగా అమ్మాయిలను అతి కిరాతకంగా హత్య చేస్తుంటారు గుర్తు తెలియని ఆగంతకులు. ఆ హత్యలు చేస్తున్నది ఎవరు ? స్వప్న కు వస్తున్న కలలు ఏంటి ? ఆ ఆగంతకులు స్వప్న ని కూడా చంపారా ? వాళ్లనుండి కాపాడుకోవడానికి స్వప్న ఏం చేసింది అన్నది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

హైలైట్స్ :

తాప్సీ
స్క్రీన్ ప్లే
డైరెక్షన్

నటీనటుల ప్రతిభ :

స్వప్న పాత్రలో తాప్సీ నటన గురించి ఎంత చెప్పినా తక్కువే! కేవలం గ్లామర్ పాత్రలతోనే కెరీర్ ప్రారంభంలో నెట్టుకొచ్చిన తాప్సీ ఇటీవల విభిన్న కథా చిత్రాలను ఎంచుకుంటు తన ప్రత్యేకత ని చాటుకుంటోంది. తాజాగా గేమ్ ఓవర్ చిత్రానికి తాప్సీ నటనే హైలెట్ గా నిలిచింది. ఎట్టి పరిస్థితుల్లోనూ మనోధైర్యం వీడకూడదు అనే మెసేజ్ తో మంచి నటన కనబరిచింది తాప్సీ. ఇక మిగిలిన పాత్రల్లో ఆయా నటీనటులు తపటప పాత్రల పరిధి మేరకు నటించారు.

సాంకేతిక వర్గం :

వసంత్ అందించిన  విజువల్స్ బాగున్నాయి, అలాగే నిర్మాణ విలువలు కూడా బాగున్నాయి. నేపథ సంగీతం మరో హైలెట్ ఈ చిత్రానికి .  ఇక దర్శకుడు విషయానికి వస్తే…… కరెంట్ ఇష్యు ని ఎంపిక చేసుకొని దానికి తగ్గ స్క్రీన్ ప్లే రూపొందించుకున్నాడు. అయితే తాప్సీ ఫ్లాష్ బ్యాక్ ఏంటి ? ఆ హంతకులు ఎవరు ? అన్నది రివీల్ చేస్తే మరింతగా బాగుండేదేమో .

ఓవరాల్ గా :

విభిన్న కథా చిత్రాలను ఎంచుకునే ప్రేక్షకులకు మంచి ఛాయిస్ గేమ్ ఓవర్.