గ్యాంగ్ లీడర్ 5 డేస్ కలెక్షన్స్ రిపోర్ట్


Gang Leader Collections
గ్యాంగ్ లీడర్ 5 డేస్ కలెక్షన్స్ రిపోర్ట్

న్యాచురల్ స్టార్ నాని నటించిన గ్యాంగ్ లీడర్ చిత్రానికి మిశ్రమ స్పందన వచ్చింది. అయితే ఈ చిత్రం తొలి వారాంతంలో డీసెంట్ గా పెర్ఫర్మ్ చేసింది. దీంతో ఒక వారం ఇలాగే కొనసాగితే చిత్రం సేఫ్ అయిపోవడం ఖాయం అనుకున్నారంతా. అయితే సోమవారం నుండి చిత్ర కలెక్షన్స్ లో హ్యుజ్ డ్రాప్ కనిపించింది. ఇప్పటివరకూ ఈ చిత్రం ఐదు రోజులకు గాను రెండు తెలుగు రాష్ట్రాలలో 13 కోట్ల 60 లక్షలు వసూలు చేసింది. ప్రపంచవ్యాప్తంగా గ్యాంగ్ లీడర్ బిజినెస్ 30 కోట్లకు జరిగిన విషయం తెల్సిందే. మరో రెండు రోజుల్లో వాల్మీకి విడుదల కానున్న నేపథ్యంలో గ్యాంగ్ లీడర్ బయ్యర్లకు నష్టాలు తీసుకురావడం ఖాయంలా కనిపిస్తోంది.

ప్రాంతం వారీగా గ్యాంగ్ లీడర్ షేర్

ప్రాంతం షేర్ (కోట్లలో)

నైజాం 5.54

సీడెడ్ 1.71

నెల్లూరు 0.43

కృష్ణ 1.04

గుంటూరు 1.11

వైజాగ్ 1.84

తూర్పు గోదావరి 1.18

పశ్చిమ గోదావరి 0.75

షేర్ మొత్తం 13.60