వీళ్ళందరికీ గ్యాంగ్ లీడర్ హిట్ అవ్వాలి


gang leader movie release date
gang leader movie release date

న్యాచురల్ స్టార్ నాని నటించిన గ్యాంగ్ లీడర్ చిత్రం సెప్టెంబర్ 13న విడుదలకు సిద్ధమైంది. ఈ సినిమాకు సంబంధించిన టీజర్, ట్రైలర్ అన్నీ కూడా ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ఉన్నాయి. అనిరుధ్ స్వరపరిచిన పాటలకు మంచి స్పందన వస్తోంది. అన్నీ పాజిటివ్ గా ఉన్న ఈ చిత్రం హిట్ అవ్వడం అటు హీరోకి, దర్శకుడికి, నిర్మాణ సంస్థకు చాలా ముఖ్యం. అదెలాగంటే.

న్యాచురల్ స్టార్ నాని కృష్ణార్జున యుద్ధం, దేవదాస్ సినిమాల ప్లాపుల తర్వాత జెర్సీతో మంచి సినిమాను అందించాడు. అయితే అది మంచి సినిమా అనిపించుకుంది కానీ డబ్బులు ఆశించిన స్థాయిలో రాలేదు. ఇక దర్శకుడు విక్రమ్ కుమార్  మనం తర్వాత ఆ స్థాయి విజయం అందుకోలేదు.

అటు మైత్రి మూవీ మేకర్స్ కు సవ్యసాచి, డియర్ కామ్రేడ్ నష్టాలనే మిగిల్చాయి. ఈ రకంగా అటు నాని, ఇటు విక్రమ్ కుమార్ కు, అలాగే నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ కు కూడా గ్యాంగ్ లీడర్ హిట్ అవ్వడం చాలా అవసరం.