గ్యాంగ్ లీడర్ భామ – హాటుగా ఘాటుగా


గ్యాంగ్ లీడర్ భామ - హాటుగా ఘాటుగా
గ్యాంగ్ లీడర్ భామ – హాటుగా ఘాటుగా

ఫస్ట్ ఇంప్రెషన్ అనేది ఎవరికైనా, ఎలాంటి ఫీల్డ్ లోనైనా చాలా ముఖ్యం. అందులోనూ సినిమా ఫీల్డ్ లో అది ఎక్కువ ప్రభావం చూపిస్తుంది. ఇక్కడ తొలి సినిమాతో ఎలాంటి ఇంప్రెషన్ కలిగించారన్నది కీలక భూమిక పోషిస్తుంది. తొలి సినిమాతో విజయం సాధించకపోయినా పర్వాలేదు కానీ మంచి ఇంప్రెషన్ కలిగించగలిగితే చాలు. అయితే మంచి ఇంప్రెషన్ కలిగించలేనప్పుడు ఏం చేయాలి? మొదలుపెట్టిన దారికి భిన్నంగా ఏదొకటి ప్రయత్నించాలి.

గ్యాంగ్ లీడర్ సినిమాతో తెలుగులో హీరోయిన్ గా పరిచయమైన భామ ప్రియాంక అరుళ్ మోహన్ ప్రస్తుతం అదే చేస్తోంది. గ్యాంగ్ లీడర్ చిత్రం ప్రొడక్షన్ లో ఉన్న సమయంలో ప్రియాంక మోహన్ గురించి హైప్ భారీగా ఇచ్చారు. ఆమె లుక్స్ గురించి, పెర్ఫార్మన్స్ గురించి ఎక్కువగా మాట్లాడుకుంటారని చెప్పారు. వారి హైప్ కి గ్యాంగ్ లీడర్ ఇంకా విడుదలవ్వకుండానే ప్రియాంక గురించి ఎంక్వయిరీలు ఎక్కువయ్యాయి. అయితే ఒక్కసారి సినిమా విడుదలవ్వగానే పరిస్థితిలో మార్పు వచ్చింది.

గ్యాంగ్ లీడర్ కంటెంట్ యావరేజ్ గా ఉండడంతో ఫలితం కూడా అలానే వచ్చింది. పైగా బాగా హైప్ ఇచ్చిన ప్రియాంక మోహన్ క్యారెక్టర్ పూర్తిగా సైడ్ ట్రాక్ లో నడవడంతో ఆమె ఎక్కడా హైలైట్ అవ్వలేదు. పెర్ఫార్మన్స్ పరంగా ఆమె చేయగలిగేది ఇందులో ఏం లేదు. పైగా ఆమె ఉన్న సమయంలో ఎక్కువ భాగం ఆమెకు డైలాగులు లేవు, మొహం బాధతో పెట్టుకునే ఎక్కువ సీన్లు నటించాల్సి వచ్చింది. దీంతో ప్రియాంక ఎక్కడా హైలైట్ అవ్వలేదు. దీనికేనా ఇంతలా హైప్ ఇచ్చింది అన్న వాళ్ళు కూడా ఉన్నారు. పైగా గ్లామర్ పరంగా కూడా గ్యాంగ్ లీడర్ లో స్కోర్ చేయడానికి అవకాశం లేదు.

అందుకే ప్రియాంక మోహన్ రూట్ మార్చింది. పద్దతిగా మడి కట్టుకుని కూర్చుంటే లాభం లేదని, ముడి కొంచెం విప్పింది. గ్లామర్ షో కి సై అన్నట్లుగా ఉండే ఫోటోలు సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తోంది. మరీ సూపర్ హాటుగా ఏం కాదు కానీ గ్లామరస్ గా కనిపించాలనే ఆమె తాపత్రయం అర్ధమవుతోంది. రీసెంట్ గా ఆమె అకౌంట్ లో అప్లోడ్ అయిన ఫోటోలు చూస్తే ఈ విషయం స్పష్టమవుతుంది. మరి ఫిల్మ్ మేకర్స్ ఈ ఫోటోలను చూస్తున్నారో లేదో!

ఇక సినిమాల విషయానికి వస్తే తమిళంలో శివ కార్తికేయన్ హీరోగా తెరకెక్కనున్న చిత్రంలో ప్రియాంక హీరోయిన్ గా ఎంపికైనట్లు వార్తలు వస్తున్నాయి. దీనిపై అధికారిక ప్రకటన ఇంకా రావాల్సి ఉంది. తెలుగులో అయితే గ్యాంగ్ లీడర్ తర్వాత మరే చిత్రమూ సైన్ చేయలేదు ఈ భామ. చూద్దాం మరి ఈమె ప్రయత్నాలు ఎంతవరకూ ఫలిస్తాయో.