నాని గ్యాంగ్ లీడర్ ప్రీ రిలీజ్ బిజినెస్.. కొండంత టార్గెట్


Gang Leader
Gang Leader

న్యాచురల్ స్టార్ నాని మరోసారి తనకు అచొచ్చిన ఎంటర్టైన్మెంట్ జోనర్ లోకి వచ్చి చేసిన సినిమా గ్యాంగ్ లీడర్. సాధారణంగా సీరియస్ గా డీల్ చేసే రివెంజ్ కథలను ఈసారి కామెడీ టచ్ తో తెరకెక్కించాడు విక్రమ్ కుమార్. ఇద్దరికీ ఈ సినిమా హిట్ అవ్వడం చాలా ముఖ్యం. టీజర్, ట్రైలర్ తో ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఏర్పరిచిన గ్యాంగ్ లీడర్ ఈ నెల 13న విడుదలకు సిద్ధమవుతోంది.

మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమా నిర్మించింది. ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం ఈ చిత్రం 28 కోట్లకు పైనే థియేట్రికల్ బిజినెస్ చేసింది. అంటే నాని హిట్ కొట్టాడు అనిపించుకోవాలంటే దగ్గరగా 30 కోట్లు వసూలు చేయాలి. ఇంత మొత్తం రాబట్టగలగాలి అంటే స్టార్ట్ అనేది అత్యంత కీలకం. సినిమాకు మొదటి రోజు నుండే మంచి టాక్ రావాల్సిన అవసరం ఉంది. మరి నాని గ్యాంగ్ లీడర్ గా సక్సెస్ అవుతాడో లేదో చూడాలి.

గ్యాంగ్ లీడర్ ప్రీ రిలీజ్ బిజినెస్ ఏరియా వైజ్ బ్రేకప్ ఇక్కడ చూడండి :

నైజాం : Rs 8.00 Cr
సీడెడ్ : Rs  3.60 Cr
ఈస్ట్ : Rs 1.60 Cr
వెస్ట్ : Rs 1.20 Cr
ఉత్తరాంధ్ర : Rs 2.50 Cr
కృష్ణ : Rs 1.45 Cr
గుంటూర్ : Rs 1.80 Cr
నెల్లూర్ : Rs  0.75 Cr

రెస్ట్ ఆఫ్ ఇండియా : Rs 1.80 Cr
ఓవర్సీస్ : Rs 5.50 Cr