బిగ్‌బాస్‌కు నెటిజ‌న్‌ల అక్షింత‌లు!


బిగ్‌బాస్‌కు నెటిజ‌న్‌ల అక్షింత‌లు!
బిగ్‌బాస్‌కు నెటిజ‌న్‌ల అక్షింత‌లు!

బిగ్‌బాస్ సీజ‌న్ 3 బ్లాస్టింగ్ హిట్ కావ‌డంతో మేక‌ర్స్ సీజ‌న్ 4ని అంత‌కు మించి చేయాల‌ని ప్లాన్‌లు చేశారు. ఇందుకు కొత్త ప్లాన్‌ని ప్ర‌వేశ పెట్టారు. కోవిడ్ కార‌ణంగా షో నిర్వ‌హ‌ణ ఇబ్బంది క‌రంగా మారుతున్న స‌మ‌యంలోనూ ప‌క్కా ప్లాన్‌తో సీజ‌న్ 4ని ప‌ట్టాలెక్కించారు. కంటెస్టెంట్‌ల విష‌యంలోనూ బిగ్‌బాస్ నిర్వాహ‌కులు నిజంగానే ఆడియ‌న్స్‌కి షాకిచ్చార‌ని చెప్పాలి.

ఎవ‌రూ ఊహించ‌ని వారిని కంటెస్టెంట్‌లుగా ఎంపిక చేయ‌డంతో ఈ షో చివ‌రి వ‌ర‌కు సాగ‌డం క‌ష్ట‌మే సుమీ అను కామెంట్‌లు వినిపించాయి. సోల్ మీడియా వేదిక‌గా బిగ్‌బాస్ కంటెస్టెంట్‌లు వీరా అనే భీభ‌త్సంగా ట్రోలింగ్ కూడా సాగింది. అయితే అనూహ్యంగా ఈ టీమ్‌లోకి యూట్యూబ్ స్టార్ గంగ‌వ్య ఎంత‌ర‌వ్వ‌డంతో షో ఆస‌క్తిక‌రంగా వుంటుంద‌నే భావ‌న మొద‌లైంది. బిగ్‌బాస్ హౌస్‌లోకి వ‌య‌సు మ‌ళ్లిన వారిని తీసుకురాకూడ‌ద‌నే నిబంధ‌న వున్నా రేటింగ్ కోసం బిగ్‌బాస్ నిర్వాహ‌కుల‌కు త‌ప్ప‌లేదు.

గంగ‌వ్వ ఎంట్రీతో షోకు రేటింగ్ బాగానే వ‌చ్చింది. కానీ మ‌రో మూడు వారాలైనా అది నిల‌వాలంటే హౌస్‌లో గంగ‌వ్వ వుండాల్సిందే. అయితే ప‌రిస్థితి అందుకు భిన్నంగా మారింది. ప‌ల్లెటూల్లో త‌న చుట్టూ వున్న వారితో క‌లివిడిగా మాట్లాడుతూ నిత్యం స్వేచ్ఛ‌గా తిరిగే గంగ‌వ్య‌కు బిగ్‌బాస్ హౌస్ ఓ జైలులామారింది. సెంట్ర‌ల్ ఏసీ స‌క‌ల సౌక‌ర్యాలు వున్నా వుండ‌నంటూ ఏడుస్తోంది. స్వ‌యంగా నాగార్జున‌నే న‌న్ను ఇంటికి పంపించండి అని అడ‌గ‌డంతో ఆమెకు స‌ర్థిచెప్పే ప్ర‌య‌త్నం చేశారు. ఈ వ‌య‌సుతో రేటింగ్‌ల కోసం గంగ‌వ్వ‌ని ఇబ్బంది పెడుతున్న బిగ్‌బాస్ నిర్వాహ‌కుల‌పై గంగ‌వ్య ఫ్యాన్స్ యుద్ధం ప్ర‌క‌టించారు. వెంట‌నే ఆమెని బ‌య‌టికి పంపించాల‌ని ఓట్లు వేసిన వారే వార్‌కి దిగి బిగ్‌బాస్ పై అక్షింత‌లు వేయ‌డం ఆస‌క్తిక‌రంగా మారింది.