మాస్ స్టెప్పుల‌తో దుమ్మురేపిన గంగ‌వ్వ‌!


మాస్ స్టెప్పుల‌తో దుమ్మురేపిన గంగ‌వ్వ‌!
మాస్ స్టెప్పుల‌తో దుమ్మురేపిన గంగ‌వ్వ‌!

బిగ్‌బాస్ సీజ‌న్ 4 పై ముందు విమ‌ర్శ‌లు వినిపించినా నిదానంగా ప‌ట్టు సాధిస్తోంది. టీఆర్పీ రేటింగ్‌లోనూ రికార్డు సృష్టిస్తోంది. గ‌త సీజ‌న్‌తో పోలిస్తే ఈ సీజ‌న్ టీఆర్పీ రేటింగ్ దేశ వ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టించింద‌ని స్వ‌యంగా నాగార్జున చెప్ప‌డం విశేషం. ఇక ఈ వీకెండ్ సండే ఎపిసోడ్ ఫండేగా సాగింది. స‌ర‌దా సాటు, టాస్క్‌ల‌తో కంటెస్టెంట్‌లు ర‌చ్చ చేశారు.

ముఖ్యంగా ఈ సీజ‌న్ హాట్ఫేవ‌రేట్‌గా దిగిన గంగ‌వ్వ మాస్ స్టెప్పుల‌తో అద‌ర‌గొట్ట‌డం ఈ ఎపిసోడ్‌కి హైలైట్‌గా నిలిచింది. ఈ వారం నాగార్జున కంటెస్టెంట్‌ల‌కు డాగ్ అండ్ బోన్ గేమ్‌ని ఇచ్చారు. ఇందులో చాలా మంది చాలా ర‌కాలుగా వినోదాన్ని పంచే ప్ర‌య‌త్నం చేసినా కుమార్ సాయితో క‌లిసి గంగ‌వ్వ చేసిన హంఆమా నే హైలైట్‌గా నిలిచింది. డాగ్ అండ్ బోన్ గేమ్‌లో గంగ‌వ్వ‌, కుమార్‌సాయి పోటీప‌డ్డారు.

ఈ పోటీ బాల‌క‌ష్ణ న‌టించిన `పైసా వ‌సూల్‌` పాట‌తో సాటింది. అయితే ఈ ఆప‌ట‌కు గంగ‌వ్వ మాస్‌స్టెప్పుల‌తో అద‌ర‌గొట్టింది. ఓ ద‌శ‌లో నాలుక మ‌డ‌త‌పెట్టి కుమార్ సాయికి చుక్క‌లు చూపించింది. మొత్తానికి బోన్‌ని సాధించి టాస్క్‌లో విజ‌యం సాధించింది. గ‌త వారం ఫీవ‌ర్ కార‌ణంగా నీర‌సంగా క‌నిపించిన గంగ‌వ్వ ట్రీట్‌మెంట్ త‌రువాత మ‌ళ్లీ త‌న‌దైన శైలిలో బిగ్‌బాస్ లో వినోదాన్ని పంచుతూ హుషారెత్తించ‌డం వీక్ష‌కుల‌తో పాటు ఆమె అభిమానుల్ని అల‌రించింది.