బిగ్ బాస్ 4: గంగవ్వ బిగ్ బాస్ కు అంత ముఖ్యమా?


బిగ్ బాస్ 4: గంగవ్వ బిగ్ బాస్ కు అంత ముఖ్యమా?
బిగ్ బాస్ 4: గంగవ్వ బిగ్ బాస్ కు అంత ముఖ్యమా?

బిగ్ బాస్ 4 కు స్పెషలిటీ తీసుకొచ్చింది కచ్చితంగా గంగవ్వ అనడంలో ఎలాంటి సందేహం లేదు. 60 ఏళ్ల వయసులో ఇంకా చలాకిగా ఉండే గంగవ్వ ఎందరికో స్ఫూర్తి. ఎక్కడో మారుమూల పల్లెటూరు నుండి వచ్చిన గంగవ్వ యూట్యూబ్ ద్వారా ఫేమస్ అయ్యి అక్కడినుండి బిగ్ బాస్ కు వచ్చింది.

బిగ్ బాస్ 4 లో గంగవ్వ చాలా యాక్టివ్ గా ఉంటున్నారు. ఆమెను బిగ్ బాస్ చాలా జాగ్రత్తగా చూసుకోవాలని కంటెస్టెంట్స్ కు చెప్పారు. ఇదే విషయం నాగార్జున కూడా అన్నాడు. గంగవ్వకు ప్రత్యేకమైన బాత్ రూమ్ కూడా ఇచ్చారంటే అర్ధం చేసుకోవచ్చు. అయితే గంగవ్వకు పాపులారిటీ విషయంలో ఎక్కడ తగ్గట్లేదు. మొదటి వీక్ ఏవో కారణాలు చెప్పి గంగవ్వను నామినేట్ చేసారు. అయితే మొదటి వారం ఫస్ట్ సేవ్ అయింది గంగవ్వే. ఇక రెండో వారం కూడా బోట్ టాస్క్ లో నామినేషన్స్ పరంగా గంగవ్వను ముందు దిగిపోమని మిగతా కంటెస్టెంట్స్ ప్రోద్బలం చేసారు. ఆమె మళ్ళీ నామినేట్ అయ్యారు. ఈసారి కూడా గంగవ్వ ముందు సేవ్ అయ్యారు.

ఇక మొన్న గంగవ్వకు అనారోగ్యం వచ్చి ఇక నేను వెళ్ళిపోతా అన్నప్పుడు బిగ్ బాస్ చాలా శ్రద్ధ చూపించి ఆమెకు నయమయ్యేలా చేసారు. ఎందుకంటే వాళ్లకు కూడా తెలుసు గంగవ్వ ఉంటే టీఆర్పీ వేరే స్థాయిలో ఉంటుందని.