ల‌క్ష్య్ హీరోగా `గ్యాంగ్ స్టార్ గంగ‌రాజు!


ల‌క్ష్య్ హీరోగా `గ్యాంగ్ స్టార్ గంగ‌రాజు!
ల‌క్ష్య్ హీరోగా `గ్యాంగ్ స్టార్ గంగ‌రాజు!

రెగ్యుల‌ర్ చిత్రాల‌కు పూర్తి భిన్నంగా క‌థాబ‌ల‌మున్న చిత్రాల‌ని నిర్మిస్తూ ప్ర‌తిభా వంతుల్ని ప్రోత్స‌హిస్తున్న సంస్థ తిరుమ‌ల తిరుప‌తి వెంక‌టేశ్వ‌ర ఫిలింస్ అధినేత ప‌ద్మావ‌తి చ‌ద‌ల‌వాడ నిర్మిస్తున్న తాజా చిత్రం `గ్యాంగ్‌స్ట‌ర్ గంగ‌రాజు`. ఇషాన్ సూర్య ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. వేదిక ద‌త్తు హీరోయిన్‌గా న‌టిస్తోంది. థ్రిల్ల‌ర్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొందుతున్న ఈ మూవీని ఇటీవ‌లే లాంఛ‌నంగా పూజా కార్య‌క్ర‌మాల‌తో ప్రారంభించారు.

క్యాచీ టైటిల్‌తో రూపొందుతున్న ఈ మూవీని ఓ విభిన్న‌మైన క‌థ‌తో తెర‌కెక్కిస్తున్నారు. పూజా కార్య‌క్ర‌మాల అనంత‌రం హీరో ల‌క్ష్య్‌పై చిత్రీక‌రించిన ముహూర్త‌పు స‌న్నివేశానికి చ‌ద‌ల‌వాడ శ్రీ‌నివాస‌రావు క్లాప్ నిచ్చారు. శుక్ర‌వారం నుంచి హైద‌రాబాద్, అర‌కు ఏక‌ధాటిగా జ‌రిగే రెండు షెడ్యూళ్ల‌లో చిత్రాన్ని పూర్తి చేయాల‌ని ప్లాన్ చేస్తున్నారు.

ఈ చిత్రానికి సంగీతం సాయి కార్తీక్‌, ఛాయాగ్ర‌హ‌ణం క‌న్నా పి.సి, ఎడిటింగ్ అనుగోజు బాబు, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్ భ‌ర‌త్ వెనిగ‌ళ్ల‌, నిర్మాత చ‌ద‌ల‌వాడ ప‌ద్మావ‌తి, ద‌ర్శ‌క‌త్వం ఇషాన్ సూర్య‌.