‘జాను’ జూనియర్ సమంత తెలుగులో హీరోయిన్ గా…

'జాను' జూనియర్ సమంత తెలుగులో హీరోయిన్ గా...
‘జాను’ జూనియర్ సమంత తెలుగులో హీరోయిన్ గా…

జాను చిత్రంలో సమంత చిన్నప్పటి పాత్రలో నటించిన హీరోయిన్ గౌరి కిషన్ ఇప్పుడు హీరోయిన్ గా అరంగేట్రం చేస్తోంది. జాను ఒరిజినల్ వెర్షన్, 96లో కూడా హీరోయిన్ చిన్నప్పటి పాత్రలో గౌరి కిషన్ నటించింది. ప్రస్తుతం తమిళంలో హీరోయిన్ గా నటిస్తోన్న గౌరి, తెలుగులో కూడా డెబ్యూ చేస్తోంది.

తన తొలి చిత్రాన్ని ఏక్ మినీ కథ ఫేమ్ సంతోష్ శోభన్ తో చేస్తోంది. చిరంజీవి పెద్ద కూతురు సుస్మిత ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఒక తమిళ థ్రిల్లర్ చిత్రానికి రీమేక్ గా ఈ సినిమా తెరకెక్కుతోంది.

ఏక్ మినీ కథ చిత్రం తర్వాత సంతోష్ శోభన్ కు అవకాశాలు బాగానే వస్తున్నాయి. ఇప్పటికే రెండు సినిమాల్లో నటిస్తున్నాడు ఈ యువ హీరో. అంతే కాకుండా మారుతి దర్శకత్వంలో ఒక వెబ్ సిరీస్ కూడా చేస్తున్నాడు. ఇక సంతోష్ శోభన్ తమిళ రీమేక్ థ్రిల్లర్ గురించి మరింత సమాచారం త్వరలోనే రానుంది.