గౌత‌మ్ మీన‌న్ షార్ట్ ఫిల్మ్ మ్యాజిక్‌!


గౌత‌మ్ మీన‌న్ షార్ట్ ఫిల్మ్ మ్యాజిక్‌!
గౌత‌మ్ మీన‌న్ షార్ట్ ఫిల్మ్ మ్యాజిక్‌!

క‌రోనా దెబ్బ‌తో మ‌న వాళ్ల క్రియేటివిటీ పీక్స్‌కి వెళ్లిపోయింది. కొత్త కొత్త‌గా ఆలోచిస్తున్నారు. టెక్నాల‌జీతో కొత్త ఫీట్‌లు చేస్తున్నారు. ఇంటి ప‌ట్టునే వుంటూ కొత్త ఐడియాల‌జీతో వీడియోలు చేస్తున్నారు. షూటింగ్‌ల‌కు అనువుగా వాతావ‌ర‌ణం లేక‌పోయినా క‌రోనా అవాక్క‌య్యేలా ఇంటి ప‌ట్టునే వుంటూ షార్ట్ ఫిల్మ్స్ చేస్తున్నారు. ఆడియ‌న్స్ అవాక్క‌య్యేలా చేస్తున్నారు.

తాజాగా ల‌వ్‌స్టోరీస్ స్పెష‌లిస్ట్ గౌతమ్ మీన‌న్ `కార్తీక్ డ‌య‌ల్ సేతా యెన్‌` పేరుతో ఓ షార్ట్ ఫిల్మ్‌ని రూపొందించారు. శింబు, త్రిష‌లు ఇందులో న‌టించారు. వీరిద్ద‌రూ క‌లిసి `ఏమాయా చేసావే`కు మాతృక అయిన‌టువంటి `విన్న‌యి తాండి వ‌రువాయా`లో న‌టించారు. తాజాగా రూపొందించిన షార్ట్ ఫిల్మ్‌లో శింబు కార్తీక్‌గా, త్రిష జెస్సీగా క‌నిపించారు.

త్రిష‌కి శింబు ఫోన్ చేయ‌డం అనే కాన్సెప్ట్ నేప‌థ్యంలో ఈ షార్ట్ ఫిల్మ్ సాగుతుంది. వీరిద్ద‌రి మ‌ధ్య సాగే సంభాష‌ణ ప్ర‌ధాన ఆక‌ర్ష‌ణ‌గా ఈ షార్ట్ ఫిల్మ్‌నిలిచింది. దీనికి ఏఆర్ రెహ‌మాన్ నేప‌థ్య సంగీతం అందించారు. దీనికి నెటిజ‌న్స్ నుంచి మంచి స్పంద‌న ల‌భిస్తోంది. కార్తీక్‌, జెస్సీల‌తో గౌత‌మ్ మీమ‌న్ మ‌ళ్లీ మ్యాజిక్ చేశార‌ని అంతా అంటున్నారు.