ఆ నటికి వర్మను పెళ్లి చేసుకోవాలనుందట


ఆ నటికి వర్మను పెళ్లి చేసుకోవాలనుందట
ఆ నటికి వర్మను పెళ్లి చేసుకోవాలనుందట

రామ్ గోపాల్ వర్మ పరిచయం అవసరం లేని పేరు. ప్రతి విషయంలోనూ వర్మ ఆలోచించే భిన్నంగా ఉంటుంది. తనదైన శైలిలో ఏదైనా ఇష్యూపై స్పందించగల రామ్ గోపాల్ వర్మ, వివాదాలకు కేంద్ర బిందువు అవుతుంటాడు. సమాజంపట్ల కానీ దేశం పట్ల కానీ తనకు ఎటువంటి గౌరవం లేవని, తాను తనకు నచ్చినట్లుగా బ్రతుకుతుంటానని, ఎవర్నీ కేర్ చేయనని చెబుతుండే వర్మకు కుటుంబం పట్ల కూడా ప్రేమ లేనట్లు మాట్లాడుతుంటాడు. అలాంటి ఒక మనిషిని పెళ్లి చేసుకోవాలని ఉందని చెప్పి సంచలనాన్ని సృష్టించింది నటి గాయత్రీ గుప్తా.

ఫిదా చిత్రంతో అందరి దృష్టిలో పడ్డ గాయత్రీ అంతకంటే ఎక్కువగా టివి డిబేట్లలో పాల్గొని ప్రాచుర్యం సంపాదించింది. ముఖ్యంగా కాస్టింగ్ కౌచ్ పై, సినిమాల్లో మహిళలు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై తరచూ స్పందిస్తుంటుంది గాయత్రీ గుప్తా. కాస్టింగ్ కౌచ్ గురించి మొదట్లో పెద్ద పోరాటమే చేసిన తర్వాత సైలెంట్ అయిపోయింది. ఎందుకిలా అని అడిగితే విచిత్రమైన సమాధానం చెప్పింది. “ఇక్కడ కాస్టింగ్ కౌచ్ ఉందన్నది వాస్తవం. ఇక్కడ దానికి ఒప్పుకుంటేనే అవకాశాలు వస్తాయి. లేదంటే లేదు. అయితే ఏదైనా ఇద్దరి అంగీకారం మీదనే జరుగుతుంది. బలవంతం ఏమీ ఉండదు. అయినా నేను కాస్టింగ్ కౌచ్ గురించి మాట్లాడినందుకె నాకు అవకాశాలు తగ్గిపోయాయి. దీని గురించి మాట్లాడినంత మాత్రాన మార్పులేం వచ్చేయవు. జనాలు కూడా ఎక్కువ రోజులు పట్టించుకోరు. మనకు అవకాశాలు కూడా ఇవ్వరు, అందుకే ఈ టాపిక్ గురించి మాట్లాడడం మానేశా” అని చెప్పుకొచ్చింది.

ఇక రామ్ గోపాల్ వర్మ గురించి టాపిక్ వచ్చినప్పుడు తనపై అభిమానాన్ని చాటిచెప్పుకుంది. “వర్మ గురించి అందరికీ ఉండే భావన వేరు, ఆయన వేరు. చాలా మంది ఆయన గురించి రకరకాలుగా చెప్పారు కానీ ఒక్కసారి ఆయనతో పనిచేస్తే అభిప్రాయాన్ని మార్చుకుంటారు. నాకంటే బాగా పెద్దవారని ఆలోచిస్తున్నా లేదంటే రామ్ గోపాల్ వర్మను పెళ్లి చేసుకునే దాన్ని” అని సంచలన వ్యాఖ్యలు చేసింది గాయత్రీ.

తనపై మాములు టాపిక్ వస్తేనే స్పందించకుండా ఉండని వర్మ ఇప్పుడు దీనిపై ఏ రకమైన వ్యాఖ్యలు చేస్తాడో చూడాలి.