మహేష్ బాబు సినిమాపై సస్పెన్స్ తొలగించిన పరశురామ్


మహేష్ బాబు సినిమాపై సస్పెన్స్ తొలగించిన పరశురామ్
మహేష్ బాబు సినిమాపై సస్పెన్స్ తొలగించిన పరశురామ్

సూపర్ స్టార్ మహేష్ బాబు ఈ ఏడాది సరిలేరు నీకెవ్వరుతో సూపర్ డూపర్ హిట్ కొట్టిన విషయం తెల్సిందే. తన కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ ను అందుకున్న మహేష్ తన తర్వాతి సినిమా విషయంలో సస్పెన్స్ ను అలానే ఉంచాడు. ముందు వంశీ పైడిపల్లి సినిమా ఉంటుందని అనుకున్నారు కానీ అది సైడ్ అయింది. చాలా రోజుల నుండి మహేష్ బాబు గీత గోవిందం ఫేమ్ పరశురామ్ దర్శకత్వంలో నటిస్తాడని వార్తలు వస్తున్నాయి. సినిమా ముహూర్తం గురించి కూడా మాట్లాడుతున్నారు కానీ అధికారిక సమాచారం లేకపోవడంతో మహేష్ – పరశురామ్ కాంబోపై సందేహాలు అలానే ఉన్నాయి.

అయితే ఈ రూమర్స్ పై పరశురామ్ ఎట్టకేలకు క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసాడు. ఒక్కడు సినిమా చూసి ఇండస్ట్రీకి రావాలని డిసైడ్ అయ్యానని, ఎలాగైనా దర్శకుడ్ని కావాలనుకున్నానని, అయితే మహేష్ బాబుతో పనిచేయడం ఒక కలలానే భావించాను. అది ఇంత త్వరగా వస్తుందనుకోలేదు. అన్ని ఎమోషన్స్ ఉండేలా ఒక పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్ ను తయారుచేస్తున్నాను. మహేష్ ఫ్యాన్స్ అందరూ గర్వపడేలా సినిమా ఉంటుంది. మహేష్ ను సరికొత్తగా ప్రెజంట్ చేయడానికి ప్రయత్నిస్తాను అని ఒక ఇంటర్వ్యూలో తెలిపాడు.

దీంతో మహేష్ 27వ సినిమాపై సస్పెన్స్ కు తెరపడినట్లే. మే 31న ఈ సినిమాను లాంచ్ చేయాలని భావించారు. అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల దృష్ట్యా అది సాధ్యపడకపోవచ్చు. ఏదేమైనా మరికొన్ని రోజుల్లో దీనిపై క్లారిటీ వచ్చే అవకాశముంది.