యంగ్ హీరోలతో సరికొత్త ప్లాన్స్ వేస్తోన్న గీతా ఆర్ట్స్


geetha arts 2 planning movies with two young heroes
geetha arts 2 planning movies with two young heroes

టాలీవుడ్ లో ఒక్కో ప్రొడక్షన్ హౌస్ కు ఒక్కో పద్దతి ఉంటుంది. ప్రముఖ నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్ కు కూడా ఒక పద్దతి ఉంది. వాళ్ళ దగ్గర కథ ఓకే అవ్వాలంటే అది చాలా పెద్ద ప్రాసెస్. చాలా మందిని దాటుకుని అది వెళ్లాల్సి ఉంటుంది. ముందుగా అక్కడ ఒక టీమ్ ఓకే చేయాలి. తర్వాత బన్నీ వాసుకు నచ్చాలి. చివరిగా అల్లు అరవింద్ ఓకే చేసిన తర్వాత ఏ హీరోకు సూట్ అవుతుందా అన్న చర్చ మొదలవుతుంది. తర్వాత ఆ హీరోకు తగ్గట్లుగా కథను మార్చుకుని వెళ్లి నరేట్ చేయాలి, ఒకవేళ నచ్చితే ఓకే.. నచ్చలేదు అంటే మాత్రం మళ్ళీ వేరే హీరో దగ్గరకు వెళుతుంది. ఈ మొత్తం ప్రాసెస్ లో ఏ ఒక్కటి ఫెయిల్ అయినా మళ్ళీ మొదటినుండి ప్రాసెస్ రన్ అవ్వాల్సి ఉంటుంది. అందుకే గీతా ఆర్ట్స్ లో కథ ఓకే అవ్వడం ఒక అగ్ని పరీక్ష లాంటిదని ఫీలవుతుంటారు రచయితలు. అందుకనే గీతా ఆర్ట్స్ కు విజయాల శాతం చాలా ఎక్కువగా ఉంటుంది. అయితే ఈ ప్రాసెస్ అంతా పూర్తవ్వడానికి దాదాపు ఆరు నెలల నుండి సంవత్సరం వరకూ టైమ్ పడుతుంది. హిట్ అయిన దర్శకులైనా, ప్లాప్ దర్శకులైనా ఈ ప్రాసెస్ మాత్రం కామన్.

అయితే ఎక్కువగా హై బడ్జెట్ మూవీస్ ను నిర్మించే గీతా ఆర్ట్స్, రీసెంట్ గా గీతా ఆర్ట్స్ 2 అనే బ్యానర్ ను స్థాపించారు. ఈ బ్యానర్ లో ఎక్కువ చిన్న, మీడియం బడ్జెట్ సినిమాలను తెరకెక్కిస్తారు. బడ్జెట్ తక్కువ ఉంటుంది కాబట్టి యంగ్ హీరోలే ఈ బ్యానర్ లో ఎక్కువగా నటిస్తారు. 6 నుండి 10 కోట్ల బడ్జెట్ లో మినిమం రిస్క్ తో సినిమాలు తెరకెక్కించాలనేది గీతా ఆర్ట్స్ ప్లాన్. దీనివల్ల వారికీ రెండు లాభాలు ఉన్నాయి. మీడియం బడ్జెట్ లో సినిమాలను తెరకెక్కించే ఐడియాస్ తో ఉన్న దర్శకులు తమ వద్ద చాలా మంది స్టక్ అయిపోయున్నారు. అలాగే ఇలాంటి నిర్మాణాలలో సుకుమార్ రైటింగ్స్, మారుతి, యూవీ క్రియేషన్స్ లాంటి వాళ్లతో భాగస్వామ్యం పెట్టుకుని సినిమాలు నిర్మిస్తే రిస్క్ కూడా బాగా తగ్గుతుంది. థియేటర్లకు ఫీడింగ్ కింద కూడా ఉంటుంది. సో, గీతా ఆర్ట్స్ 2 నుండి వచ్చే ఏడాది ఎక్కువ సంఖ్యలో సినిమాలను ప్లాన్ చేస్తున్నారు అల్లు అరవింద్ అండ్ కో.

ముందుగా నిఖిల్ హీరోగా సుకుమార్ రైటింగ్స్ తో కలిసి ఒక సినిమాను ప్లాన్ చేసిన విషయం తెల్సిందే. త్వరలోనే ఈ చిత్ర షూటింగ్ కూడా మొదలవుతుంది. ఆరెక్స్ 100 ఫేమ్ కార్తికేయ కూడా ఒక సినిమాకు లాక్ అయ్యాడు. దర్శకుడు ఎవరు అనేది త్వరలోనే వెల్లడిస్తారు. అల్లు శిరీష్ కు ఇది సొంత బ్యానర్ కాబట్టి తనతో కూడా ఒక సినిమాను ప్లాన్ చేస్తున్నారు. ఇలా వరసగా యంగ్ హీరోలతో సినిమాలు ప్లాన్ చేస్తున్నారు. మరి ఈ ప్రయత్నం ఎంత వరకూ ఫలితాన్ని ఇస్తుందో చూడాలి.