గీతా ఆర్ట్స్‌లో హ్యాట్రిక్ హిట్‌కి రౌడీ రెడీ?

Geetha arts and Vijay deverakonda team up soon
Geetha arts and Vijay deverakonda team up soon

రౌడీ హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ క్రేజ్ టాలీవుడ్‌లో ఏ స్థాయిలో వుందో అంద‌రికి తెలిసిందే. అయితే అత‌నితో మెగా ప్రొడ్యూస‌ర్ అల్లు అర‌వింద్కు మ‌ధ్య మంచి అనుబంధం ఏర్ప‌డింది. గీతా ఆర్ట్స్‌లో విజ‌య్ దేవ‌ర‌కొండ న‌టించిన టాక్సీవాలా, గీత గోవింద సూప‌ర్‌హిట్‌లుగా నిలిచాయి. దీంతో విజ‌య్‌కి అల్లు అర‌వింద్ అంటే మంచి గౌర‌వం ఏర్పడింది. ఆ అనుబంధం కార‌ణంగానే విజ‌య్ ప్ర‌స్తుతం అల్లు అర‌వింద్ ప్రారంభించిన `ఆహా`కు బ్రాండ్ అంబాసిడ‌ర్‌గా మారిన విష‌యం తెలిసిందే.

అయితే మ‌రోసారి అల్లు అర‌వింద్‌, విజ‌య్ దేవ‌ర‌కొండ కాంబినేష‌న్‌లో ముచ్చ‌ట‌గా మూడ‌వ సినిమా ఎప్పుడ‌ని అంతా ఎదురుచూస్తున్నారు. అయితే అది త్వ‌ర‌లోనే కార్య‌రూపం దాల్చ‌బోతోంది. ఇటీవ‌ల జ‌రిగిన `వ‌ర‌ల్డ్ ఫేమ‌స్ ల‌వ‌ర్‌` ప్రీ రిలీజ్ వేడుక‌లో ఈ విష‌యాన్ని అల్లు అర‌వింద్ స్ప‌ష్టం చేశారు. గీతా ఆర్ట్స్‌లో విజ‌య్ దేవ‌ర‌కొండ ఓ సినిమా చేస్తాడ‌ని, అది హ్యాట్రిక్ హిట్ సాధించ‌డం ఖాయం అని వేదిక‌పైనే వెల్ల‌డించ‌డం విశేషం.

విజ‌య్ దేవ‌ర‌కొండ ప్ర‌స్తుతం వెర్స‌టైల్ డైరెక్ట‌ర్ పూరి జ‌గ‌న్నాథ్ డైరెక్ష‌న్‌లో `ఫైట‌ర్‌` చిత్రాన్ని చేస్తున్న విష‌యం తెలిసిందే. ఈ సినిమా పూర్త‌యిన త‌రువాత మైత్రీ మూవీమేక‌ర్స్ నిర్మిస్తున్న `హీరో` చిత్రాన్ని మొద‌లుపెడ‌తార‌ట‌.