పది రోజుల్లో 75 కోట్లు కొల్లగొట్టిన విజయ్ దేవరకొండ


geetha govindam 10 days world wide collections

ఆగస్టు 15న విడుదలైన గీత గోవిందం చిత్రంతో పది రోజుల్లోనే 75 కోట్ల గ్రాస్ వసూళ్ల ని కొల్లగొట్టి సంచలనం సృష్టించాడు విజయ్ దేవరకొండ . అగ్ర హీరోలకు సైతం ఈ భారీ వసూళ్లు ఈమధ్య సాధ్యం కావడం లేదు కొంతమందికి కానీ విజయ్ దేవరకొండ మాత్రం అవలీలగా 50 కోట్లని దాటేసి 75 కోట్ల గ్రాస్ వసూళ్ల తో ప్రభంజనం సృష్టిస్తున్నాడు . కథగా చెప్పుకుంటే పెద్దగా ఏమి లేదు గీత గోవిందం కానీ తన నటనతో , రష్మిక మండన తో చేసిన రొమాన్స్ తో యువత ని విపరీతంగా మెప్పిస్తున్నాడు ఈ యంగ్ హీరో .

ఇప్పటివరకు 75 కోట్ల వసూళ్లు సాధించగా ఈరోజు విడుదలైన సినిమాలలో కూడా పెద్దగా ఆకట్టుకునే చిత్రాలు లేవు కాబట్టి గీత గోవిందం మరిన్ని వసూళ్లు సాధించడం ఖాయంగా కనిపిస్తోంది . విజయ్ దేవరకొండ – రష్మిక మండన ల మధ్య రొమాన్స్ ప్రేక్షకులను గిలిగింతలు పెట్టేలా చేస్తోంది అందుకే కుర్రకారు ఈ సినిమాని ఎగబడి మరీ చూస్తున్నారు . ఇప్పటికే నిర్మాతలు , బయ్యర్లు భారీ లాభాలలోకి వెళ్లారు ఇంకా మంచి వసూళ్లు వస్తున్నాయి కాబట్టి ఎవరూ ఊహించని లాభాలు పొందుతున్నారు నిర్మాతలు అలాగే బయ్యర్లు . మొత్తానికి అర్జున్ రెడ్డి తర్వాత సాలిడ్ బ్లాక్ బస్టర్ తో స్టార్ లీగ్ లో చేరిపోయాడు విజయ్ దేవరకొండ .

English Title: geetha govindam 10 days world wide collections