120 కోట్లు సాధించిన విజయ్ దేవరకొండ


geetha govindam 26 days world wide collectionsటాలీవుడ్ నయా సూపర్ స్టార్ విజయ్ దేవరకొండ తాజాగా గీత గోవిందం చిత్రంతో 120 కోట్ల క్లబ్ లో చేరిపోయాడు . ఆగస్టు 15న విడుదలైన గీత గోవిందం చిత్రం 26 రోజుల్లో 120 కోట్ల గ్రాస్ వసూళ్ల ని ప్రపంచ వ్యాప్తంగా సాధించి ట్రేడ్ విశ్లేషకులను ఆశ్చర్యానికి గురిచేసింది . రెండు తెలుగు రాష్ట్రాలతో పాటుగా , తమిళనాడు , కర్ణాటక , ఓవర్ సీస్ లలో విడుదలైన అన్ని చోట్లా ప్రభంజనం సృష్టించాడు విజయ్ దేవరకొండ దాంతో స్టార్ హీరోలలో కొంతమందికి వీలుకాని వంద కోట్ల క్లబ్ లో అవలీలగా జాయిన్ అయ్యాడు విజయ్ దేవరకొండ . పరశురాం దర్శకత్వంలో బన్నీ వాసు నిర్మించిన గీత గోవిందం చిత్రంలో విజయ్ దేవరకొండ సరసన రష్మిక మందన నటించింది . విజయ్ దేవరకొండ – రష్మిక మందన ల కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అవ్వడం కూడా ఈ సినిమా ఘన విజయానికి కలిసి వచ్చింది . 26 రోజుల్లో 120 కోట్ల గ్రాస్ వసూళ్లు 66 కోట్ల షేర్ తో సంచలనంగా మారింది గీత గోవిందం చిత్రం .

ఇక ఏరియాల వారీగా వసూళ్లు ఇలా ఉన్నాయి .
నైజాం – 19 కోట్ల షేర్
సీడెడ్ – 6. 45 కోట్ల షేర్
కృష్ణా – 3. 51 కోట్ల షేర్
గుంటూరు – 3. 63 కోట్ల షేర్
ఈస్ట్ – 3. 55 కోట్ల షేర్
వెస్ట్ – 2. 97 కోట్ల షేర్
నెల్లూరు – 1. 50 కోట్ల షేర్
ఉత్తరాంధ్ర – 5. 59 కోట్ల షేర్
కర్ణాటక – 5. 90 కోట్ల షేర్
తమిళనాడు – 2. 10 కోట్ల షేర్
ఓవర్ సీస్ – 9. 75 కోట్ల షేర్
రెస్ట్ ఆఫ్ ఇండియా , రెస్ట్ ఆఫ్ వరల్డ్ – 2. 45 కోట్ల షేర్
మొత్తం – 66. 4 షేర్
గ్రాస్ వసూళ్లు – 120. 1 కోట్లు

English Title: geetha govindam 26 days world wide collections