గీత గోవిందం డైరెక్టర్ కు ఇంకా సినిమా సెట్ కాలేదుParasuram
Parasuram

గీత గోవిందం వంటి బ్లాక్ బస్టర్ ఇచ్చిన తర్వాత కూడా పరశురామ్ కు ఇంకా సినిమా సెట్ కాలేదు , గీత గోవిందం విడుదలై అప్పుడే ఏడాది కావస్తోంది . అయినప్పటికీ ఈ దర్శకుడికి ఇంకా సినిమా సెట్ కాలేదంటే ఎంత దయనీయంగా ఉందో పరిస్థితి . పరశురామ్ కు గీత గోవిందం హిట్ తర్వాత విపరీతమైన క్రేజ్ వచ్చింది దాంతో పెద్ద ఎత్తున నిర్మాతలు క్యూ కట్టారు పరశురామ్ కోసం .

కానీ ఒక్క సినిమా అంటే ఒక సినిమా కూడా అధికారికంగా ఇంతవరకు ప్రకటించలేదు . పలువురు హీరోలు , నిర్మాతలు పరశురామ్ తో సినిమా చేయాలనీ ఆశపడ్డారు కానీ ఏది కూడా సెట్ కాలేదు. స్క్రిప్ట్ వర్క్ అయితే జరుగుతోంది కానీ అప్పుడే ఏడాది అవుతోంది గీత గోవిందం వచ్చి దాంతో ఏడాది కాలం తర్వాత పరశురామ్ చేసే సినిమా అగ్ర హీరో ది అవుతుందా ? లేక చిన్న హీరో దా ? ఇదే ఇప్పుడు వచ్చే ప్రశ్న