గీత గోవిందం దర్శకుడి పరిస్థితి ఏంటి ?


గత ఏడాది గీత గోవిందం చిత్రంతో సంచలనం సృష్టించిన దర్శకుడు పరశురాం అయితే ఆ సినిమా తర్వాత పరశురామ్ తో సినిమాలు చేయడానికి బోలెడుమంది హీరోలు , నిర్మాతలు పోటీ పడ్డారు కానీ ఎవరితో చేయాలో తెలీని విచిత్రకరమైన పరిస్థితి దాంతో మెగా కాంపౌండ్ లోనే లాక్ అయిపోయాడు . అల్లు శిరీష్ తో శ్రీరస్తు శుభమస్తు చిత్రం చేస్తున్న సమయంలోనే వరుసగా మూడు సినిమాల ఒప్పందం ఉంది అల్లు అరవింద్ తో దాంతో బయటి చిత్రాలు చేయలేకపోయాడు .

గీత గోవిందం చిత్రం కూడా వాళ్ళ బ్యానర్ లోనే చేసాడు ఇక ఇది బాక్స్ లు బద్దలు కొట్టడంతో ఇంకా విచిత్రమైన పరిస్థితి ఏర్పడింది . డిమాండ్ బాగా ఉంది కానీ బయటి సినిమాలు చేయలేని పరిస్థితి . మరో సినిమా కూడా అల్లు అరవింద్ బ్యానర్ లోనే చేయాలి అప్పుడే బయటి సినిమాలు . ఇప్పట్లో పరశురాం మరో సినిమా చేసేలా కనిపించడం లేదు . అప్పుడే గీత గోవిందం వచ్చి 9 నెలలు అయ్యింది కానీ పరశురామ్ కొత్త సినిమా ఏది ? అంటే మాత్రం సమాధానం లేదు పాపం .