విజ‌య్ దేవ‌ర‌కొండ ద‌ర్శ‌కుడితో అక్కినేని హీరో!విజ‌య్ దేవ‌ర‌కొండ ద‌ర్శ‌కుడితో అక్కినేని హీరో!
విజ‌య్ దేవ‌ర‌కొండ ద‌ర్శ‌కుడితో అక్కినేని హీరో!

విజ‌య్ దేవ‌ర‌కొండ హీరోగా ప‌ర‌శురామ్ రూపొందించిన చిత్రం `గీత గోవిందం`. హీరో హీరోయిన్‌ల మ‌ధ్య వున్న కాన్‌ఫిక్ట్‌ని ప్ర‌ధానాంశంగా తీసుకుని ఆద్యంతం ఆస‌క్తిక‌రంగా ద‌ర్శ‌కుడు ప‌ర‌శురామ్ చిత్ర క‌థ‌ని న‌డిపించిన తీరు ప్రేక్ష‌కుల‌తో పాటు విమ‌ర్శ‌కుల్ని సైతం ఆక‌ట్టుకుంది. చిన్ని చిత్రంగా విడుద‌లైన ఈ సినిమా బాక్సాఫీస్ వ‌ద్ద భారీ వ‌సూళ్ల‌ని సాధించి హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ‌ని వంద కోట్ల క్ల‌బ్ హీరోగా నిల‌బెట్టింది. దీంతో ఈ సినిమా త‌రువాత ద‌ర్శ‌కుడు ప‌ర‌శురామ్‌కు ఆఫ‌ర్‌ల వెల్లువ మొద‌లైంది.

చాలా మంది నిర్మాత‌లు ప‌ర‌శురామ్ డేట్స్ కోసం క్యూ క‌ట్టారు కూడా. అల్లు అర్జున్ హీరోగా ప‌ర‌శురామ్ సినిమా చేస్తాడ‌ని కూడా ప్ర‌చారం జ‌రిగింది. కానీ గీతా ఆర్ట్స్ నుంచి ఎలాంటి ప్ర‌క‌ట‌న రాలేదు. దీంతో మ‌రి కొంత కాలం ప‌ర‌శురామ్ వేచి చూడాల్సిందే అన్నారు. అయితే ప‌ర‌శురామ్ మాత్రం త‌న‌కు అంద‌రికంటే ముందుగా అడ్వాన్స్ ఇచ్చిన 14 రీల్స్ ప్ల‌స్ నిర్మాత‌ల‌కే త‌న త‌దుప‌రి చిత్రాన్ని చేసేందుకు గ్రీన్‌సిగ్న‌ల్ ఇచ్చేశారు. ఈ చిత్రంలో అక్కినేని వార‌బ్బాయి నాగ‌చైత‌న్య హీరోగా న‌టించ‌బోతున్నారు.

ఈ విష‌యాన్ని శ‌నివారం చిత్ర బృందం సోష‌ల్ మీడియా ట్విట్ట‌ర్ వేదిక‌గా ప్ర‌క‌టించారు. ఇటీవ‌ల వ‌రుప్‌తేజ్‌తో `గ‌ద్ద‌ల‌కొండ గ‌ణేష్‌` చిత్రాన్ని నిర్మించిన ఈ మేక‌ర్స్ ప‌ర‌శురామ్ డైరెక్ష‌న్‌లో నాగ‌చైత‌న్య హీరోగా ఓ సినిమా చేయ‌బోతున్నారు. రామ్ ఆనంట‌, గోపీచంద్ ఆచంట నిర్మించ‌నున్న ఈ సినిమా చైతూ 20వ చిత్రంగా తెర‌పైకి రాబోతోంది. దీనికి సంబంధించిన మ‌రిన్ని వివ‌రాల్ని చిత్ర బృందం త్వ‌ర‌లోనే ప్ర‌క‌టించ‌నుంది.

Credit: Twitter