5 రోజుల్లో 32 కోట్లు వసూలు చేసిన విజయ్ దేవరకొండ


geetha govindam five days world wide collections

గీత గోవిందం చిత్రం ప్రపంచ వ్యాప్తంగా 5 రోజుల్లో 32 కోట్లకు పైగా షేర్ వసూల్ చేసి సంచలనం సృష్టిస్తోంది. విజయ్ దేవరకొండ కు ఉన్న ఇమేజ్ ఏంటో ఈ దెబ్బతో తెలిసింది. చిన్న చిత్రంగా వచ్చిన గీత గోవిందం భారీ వసూళ్లు సాధిస్తూ అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. రెండు తెలుగు రాష్ట్రాల లోనే కాకుండా తమిళనాడు లో అలాగే ఓవర్సీస్ లో కూడా షాకింగ్ కలెక్షన్స్ కలెక్ట్ చేస్తోంది గీత గోవిందం. కేవలం అయిదు రోజుల్లోనే 32 కోట్ల షేర్ సాధించడం అంటే మామూలు విషయం కాదు , స్టార్ హీరోలకు మాత్రమే సాధ్యమయ్యే ఫీట్ అది అంటే విజయ్ దేవరకొండ స్టార్ హీరో రేంజ్ లో చేరిపోయినట్లే !

విజయ్ దేవరకొండ -రష్మీక మందన జంటగా నటించిన ఈ చిత్రానికి పరశురాం దర్శకత్వం వహించగా బన్నీ వాసు నిర్మించాడు. అల్లు అరవింద్ సమర్పకులుగా వ్యవహరించారు. ఆగస్ట్ 15న విడుదలైన ఈ చిత్రానికి వసూళ్ల వర్షం కురుస్తోంది. విజయ్ దేవరకొండ , రష్మీక ల రొమాన్స్ ఈ చిత్రానికి హైలెట్ గా నిలిచింది. గోపిసుందర్ సంగీతం కూడా ఈ చిత్రానికి హైలెట్ గా నిలిచింది. మొత్తానికి 5 రోజుల్లోనే 32 కోట్ల షేర్ రాబట్టిందంటే లాంగ్ రన్ లో 60 కోట్ల షేర్ రాబట్టడం పెద్ద కష్టమేమీ కాదని అంటున్నారు. పైగా ఏ సినిమా కూడా లేదు కాబట్టి విజయ్ మరిన్ని కలెక్షన్లు కుమ్మడం ఖాయం.

English Title: geetha govindam five days world wide collections