ఓవర్సీస్ లో టాప్ 7 గా నిలిచిన గీత గోవిందం

Geetha govindam gets 7th place in usa boxofficeవిజయ్ దేవరకొండ హీరోగా నటించిన గీత గోవిందం చిత్రం ఓవర్ సీస్ లో టాప్ టెన్ చిత్రాల్లో 7 వ స్థానాన్ని ఆక్రమించింది . 7 వ స్థానంలో నితిన్ హీరోగా నటించిన అ ఆ చిత్రాన్ని వెనక్కినెట్టి ఆ స్థానాన్ని విజయ్ దేవరకొండ ఆక్రమించాడు . ఆగస్టు 15న విడుదలైన గీత గోవిందం చిత్రం ఇప్పటివరకు ప్రపంచ వ్యాప్తంగా 120 కోట్లకు పైగా వసూళ్ళని సాధించగా ఓవర్ సీస్ లో $ 2, 454,233 డాలర్లను వసూల్ చేసి 6 వ స్థానంలో ఉన్న మహానటి చిత్రాన్ని సైతం వెనక్కి నెట్టడానికి సన్నాహాలు చేస్తున్నాడు విజయ్ దేవరకొండ . విచిత్రం అలాగే విశేషం ఏంటంటే మహానటి చిత్రంలో కూడా విజయ్ దేవరకొండ నటించడం .

పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కిన గీత గోవిందం చిత్రం చిన్న చిత్రంగా వచ్చి ప్రభంజనం సృష్టించింది . కేవలం 14 కోట్ల బిజినెస్ తో రంగంలోకి దిగిన గీత గోవిందం ఏకంగా 120 కోట్ల గ్రాస్ ని 65 కోట్ల షేర్ ని సాధించి ట్రేడ్ విశ్లేషకులను సైతం ఆశ్చర్యానికి గురిచేసింది . విజయ్ దేవరకొండ సరసన రష్మిక మందన్న నటించగా బన్నీ వాసు ఈ చిత్రాన్ని నిర్మించాడు . ఇప్పటికి కూడా చాలాచోట్ల మంచి వసూళ్లతో రన్ అవుతోంది గీత గోవిందం చిత్రం దాంతో ఓవర్ సీస్ లో కూడా రెండున్నర మిలియన్ డాలర్లకి అవలీలగా దాటేయడం ఖాయమని అంటున్నారు .

English Title: Geetha govindam gets 7th place in usa boxoffice