దర్శకులు పరశురామ్ గీతా ఆర్ట్స్ బ్యానర్ లో అల్లు శిరీష్ తో ” శ్రీరస్తు శుభమస్తు ” వంటి సూపర్ హిట్ చిత్రాన్ని తీసాడు . అల్లు శిరీష్ కు మంచి హిట్ నిచ్చాడు పరశురామ్ దాంతో ఈ దర్శకుడి పనితీరు నచ్చి మరో రెండు సినిమాలు కూడా మా బ్యానర్ లోనే చేయాలనీ ఒప్పందం చేసుకున్నారు . అయితే గీత గోవిందం చిత్ర కథ మిగతా హీరోలకు వినిపించాడు కానీ విజయ్ దేవరకొండ అయితేనే కరెక్ట్ అని భావించి అతడితో చేసాడు కట్ చేస్తే బ్లాక్ బస్టర్ అయ్యింది వంద కోట్లని అవలీలగా సంపాదించింది . అదే అల్లు శిరీష్ తో కనుక ఈ గీత గోవిందం చేసి ఉంటే ఈ స్థాయి హిట్ అయ్యేది కానే కాదు .
English Title: geetha govindam great escape from mega hero