గీత గోవిందం రివ్యూ


geetha-govindam-movie-review

గీత గోవిందం రివ్యూ :
నటీనటులు : విజయ్ దేవరకొండ , రష్మిక ,
సంగీతం : గోపీసుందర్
నిర్మాత : బన్నీ వాసు
దర్శకత్వం : పరశురామ్
రేటింగ్ : 3 / 5
రిలీజ్ డేట్ : 15 ఆగస్టు 2018

అర్జున్ రెడ్డి చిత్రంతో అనూహ్యమైన క్రేజ్ సొంతం చేసుకున్న విజయ్ దేవరకొండ తాజాగా పరశురామ్ దర్శకత్వంలో నటించిన చిత్రం గీత గోవిందం . రష్మిక మండన హీరోయిన్ గా నటించిన ఈ చిత్రానికి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది . రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ గీత గోవిందం ప్రేక్షకులను అలరించేలా రూపొందిందా ? లేదా ? అన్నది తెలియాలంటే కథ లోకి వెళ్లాల్సిందే .

కథ :

కాలేజీ లో లెక్చరర్ అయిన విజయ్ గోవింద్ (విజయ్ దేవరకొండ ) చాలా పద్దతిగల యువకుడు దాంతో తాను పెళ్లి చేసుకోబోయే అమ్మాయి కూడా ఇంకా పద్ధతిగా ఉండాలని కోరుకుంటాడు . సరిగ్గా అలాంటి సమయంలోనే తాను కోరుకున్న అమ్మాయి లక్షణాలు ఉన్న గీత ( రష్మిక మండన ) కనిపిస్తుంది ఇంకేముంది తొలిచూపులోనే ప్రేమలో పడతాడు కానీ ఆ విషయం ఆమెకు చెప్పలేక పోతాడు . ఈలోగా పనిమీద కాకినాడ వెళ్లాల్సి వస్తుంది సరిగ్గా అదే బస్సులో తన పక్క సీటులోనే గీత కూర్చోవడంతో తన ప్రేమ విషయాన్ని చెబుదామనుకుంటాడు . అయితే అనూహ్యంగా చేసిన ఓ పని వల్ల విజయ్ గోవింద్ మంచి వ్యక్తి కాడని నిర్దారణకు వస్తుంది దాని తర్వాత జరిగే పరిణామాలు కూడా విజయ్ ని చెడ్డవాడిగా చిత్రీకరించడబడతాయ్ దాంతో తన ప్రేమని పొందడానికి గీత మనసు మారడానికి విజయ్ గోవింద్ ఏం చేసాడు ? చివరకు గోవిందం ప్రేమ సక్సెస్ అయ్యిందా ? లేదా ? అన్నది తెలియాలంటే సినిమా చూడాల్సిందే .

హైలెట్స్ :

విజయ్ దేవరకొండ – రష్మిక ల కెమిస్ట్రీ
సంగీతం

డ్రా బ్యాక్స్ :

సెకండాఫ్ లో కొన్ని సన్నివేశాలు

నటీనటుల ప్రతిభ :

విజయ్ దేవరకొండ తన పాత్రకు నూటికి నూరుపాళ్లు న్యాయం చేసాడు . అద్భుతమైన టైమింగ్ తో నటనతో ఆకట్టుకున్నాడు ఈ హీరో . విజయ్ గోవిందం పాత్రకు తనదైన స్థాయిలో బెటర్ మెంట్ ఇచ్చి శెహభాష్ అనిపించాడు . అర్జున్ రెడ్డి లో అగ్రెసివ్ గా కనిపించిన విజయ్ దేవరకొండ ఈ చిత్రంలో మేడం, మేడం అంటూ ప్రేక్షకులను విశేషంగా అలరించాడు . ఇక రష్మిక మండన మరోసారి తెలుగు ప్రేక్షకులను మెప్పించింది . తెరమీద విజయ్ దేవరకొండ – రష్మిక ల జంట చూడముచ్చటగా ఉందంటే ఆ క్రెడిట్ లో సగభాగం రష్మిక దే ! అందంగా ఉంది అంతకంటే అందంగా నటించి మెప్పించింది రేష్మిక . పైగా ఇద్దరి మధ్య కెమిస్ట్రీ కూడా బాగా వర్కౌట్ అయ్యింది . వెన్నెల కిషోర్ కామెడీ టైమింగ్ బాగుంది ,ఇక మిగిలిన పాత్రల్లో ఆయా నటీనటులు తమతమ పాత్రల పరిధిమేరకు బాగా నటించారు .

సాంకేతిక వర్గం :

గత ఏడాది శ్రీరస్తు శుభమస్తు చిత్రంతో ప్రేక్షకులను అలరించిన పరశురామ్ విజయ్ దేవరకొండ ని సరికొత్తగా చూపించి సక్సెస్ అయ్యాడు . విజయ్ దేవరకొండ అనగానే అర్జున్ రెడ్డి తో పోల్చుతారు కానీ దాన్ని ఎక్కడా టచ్ చేయకుండా పాత్ర పరిధిమేరకు నటించేలా చేసి ప్రేక్షకుల మెప్పు పొందాడు . అయితే ఫస్టాఫ్ ని బాగానే రాసుకున్న దర్శకుడు సెకండాఫ్ కు వచ్చేసరికి అనుకున్న స్థాయిలో రాణించలేక పోయాడు . కథనం మరీ నెమ్మదించింది , సెకండాఫ్ లో కూడా మరిన్ని జాగ్రత్తలు తీసుకొని చేసి ఉంటే మరింత పెద్ద హిట్ అయ్యేది . గోపీసుందర్ అందించిన పాటలు బాగున్నాయి , ఛాయాగ్రహణం ఈ సినిమాకు మరింత అందాన్ని ఇచ్చింది . బన్నీ నిర్మాణ విలువలు బాగున్నాయి .

ఓవరాల్ గా :

విజయ్ దేవరకొండ – రష్మిక ల రొమాన్స్ కోసం తప్పకుండా చూడొచ్చు .

English Title: geetha govindam movie review

                              Click here for English Review