హిందీలో రీమేక్ కానున్న గీత గోవిందం


Geetha govindam ready to remake in bollywood

టాలీవుడ్ లో గత ఏడాది విడుదలై సంచలన విజయం సాధించిన గీత గోవిందం చిత్రాన్ని తాజాగా బాలీవుడ్ లో రీమేక్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు . చిన్న చిత్రంగా విడుదలై సంచలన విజయం సాధించింది గీత గోవిందం . విజయ్ దేవరకొండ నటించిన అర్జున్ రెడ్డి చిత్రం బాలీవుడ్ లో రీమేక్ అవుతున్న విషయం తెలిసిందే . దాంతో గీత గోవిందం చిత్రానికి కూడా విపరీతమైన క్రేజ్ ఏర్పడింది .

ఇక ఈ చిత్రంలో హీరోగా నటించడానికి ఇషాన్ కట్టర్ అనే యంగ్ హీరో సమాయత్తం అవుతున్నాడట ! గత ఏడాది శ్రీదేవి కూతురు జాహ్నవి తో ధఢక్ అనే చిత్రంలో నటించి బ్లాక్ బస్టర్ అందుకున్నాడు . ధఢక్ తో ఒక్కసారిగా ఇషాన్ కట్టర్ క్రేజీ హీరో అయ్యాడు . ఇక ఇప్పుడు గీత గోవిందం రీమేక్ చేస్తే ……. అదే మ్యాజిక్ అక్కడ కూడా రిపీట్ అయితే ఇషాన్ పంట పండినట్లే విజయ్ దేవరకొండ లాగా !

English Title: Geetha govindam ready to remake in bollywood

Image result for Geetha govindam ready to remake in bollywood