50 కోట్ల దిశగా గీత గోవిందం


Geetha govindam running towards 50 crores clubవిజయ్ దేవరకొండ నటించిన గీత గోవిందం చిత్రం 50 కోట్ల దిశగా దూసుకుపోయేలా కనిపిస్తోంది . ఇప్పటికే మూడు రోజుల్లో 30 కోట్లకు పైగా గ్రాస్ వసూల్ చేసిన ఈ చిత్రం 18 కోట్లకు పైగా షేర్ సాధించి ఆశ్చర్యానికి గురిచేస్తోంది . అవలీలగా 50 కోట్ల షేర్ సాధించే సినిమాగా గీత గోవిందం నిలబడుతుందని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు . ఆగస్టు 15న విడుదలైన ఈ చిత్రానికి భారీ ఓపెనింగ్స్ లభించాయి . రెండో రోజు కూడా అదేజోరు చూపిస్తూ భారీ వసూళ్ల ని కొనసాగిస్తోంది .

ఇక్కడ తెలుగు రాష్ట్రాలలోనే కాకుండా ఓవర్ సీస్ లో సైతం గీత గోవిందం చిత్రానికి బ్రహారథం పడుతున్నారు ప్రేక్షకులు . విజయ్ దేవరకొండ – రష్మిక మండన ల కెమిస్ట్రీ బాగా వర్కౌట్ కావడంతో ఈ సినిమాకు ఎనలేని క్రేజ్ వచ్చింది , ముఖ్యంగా యువత ఈ సినిమా కోసం ఎగబడుతున్నారు . పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కిన గీత గోవిందం చిత్రాన్ని బన్నీ వాసు నిర్మించగా లాభాల పంట పండుతుండటంతో బయ్యర్లు చాలా సంతోషంగా ఉన్నారు . విజయ్ దేవరకొండ కున్న క్రేజ్ తో భారీ వసూళ్లు వస్తున్నాయి ఈ సినిమాకు .

English Title: Geetha govindam running towards 50 crores club