పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చిన గీతా నందం!Geetha Madhuri Gives Birth To A Baby Girl
Geetha Madhuri Gives Birth To A Baby Girl

స్నేహగీతం చిత్రంతో నటుడిగా పరిచయమైన నందు అనేకమైన చిత్రాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా మంచిపాత్రలతో గుర్తింపు తెచ్చుకున్నారు. రీసెంట్ గా ఆయన మాస్ డైరెక్టర్ బోయపాటి శీను దరఃసకత్వం వహించిన జయ జానకి నాయకా చిత్రంలో ముఖ్య పాత్ర పోషించారు.

ఆ చిత్రం సూపర్ హిట్ అయి నటుడిగా నందుకు మంచి గుర్తింపు తెచ్చింది. ఇక పొతే నందు భార్య గీతా మాధురి గాయనిగా, డబ్బింగ్ ఆర్టిస్ట్ గా ఎంతో పేరు తెచ్చుకున్నారు.

“నేను పక్కా లోకల్ పక్కా లోకల్” అంటూ ఫాస్ట్ బీట్ సాంగ్స్ తో మాస్ ప్రేక్షలను తన గాత్రంతో అలరించిన గీత మాధురి నందుని 2014లో పెద్దల అంగీకారంతో పెళ్లిచేసుకున్నారు.

ఎంతో హ్యాపీగా వీరి అన్యోన్న దాంపత్యం కొనసాగుతుంది. కాగా వీరిద్దరికి ఆగస్ట్ 9న పండంటి ఆడబిడ్డ జన్మించింది. ఈ విషయాన్ని నందు స్వయంగా ట్విట్టర్ ద్వారా తెలిపి తల్లీ, బిడ్డలు క్షేమంగా వున్నారు అని పోస్ట్ చేసారు.. అందరికీ నా కృతజ్య్తతలు అని తెలిపారు..