వార్నింగ్ ఇస్తున్న గీతా మధురి


Geetha madhuri warns youtube channels

కొన్ని యు ట్యూబ్ చానళ్ళ వాళ్ళు నన్ను అసభ్యకరంగా అవమానిస్తున్నారని అటువంటి యు ట్యూబ్ చానళ్ళ పై చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి సిద్దం అవుతున్నానని ఆగ్రహం వ్యక్తం చేస్తోంది . గాయనిగా మంచి ఫాలోయింగ్ ఉన్న ఈ భామ ఇటీవలే బిగ్ బాస్ 2 లో పార్టిసిపేట్ చేసి రన్నరప్ గా నిలిచిన విషయం తెలిసిందే . అయితే బిగ్ బాస్ లో పాల్గొన్న సమయంలో పలువురితో చనువుగా ఉండటంతో ఆమెకు ఇతరులకు లింక్ పెడుతూ రకరకాల కథనాలు యు ట్యూబ్ వాళ్ళు అల్లారు , ఇక కొంతమంది అయితే మరీ దిగజారి కథనాలు వండి వార్చడంతో గీతా మాధురి ఆ కథనాల పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తోంది .

నాపై చీప్ గా అల్లిన కథనాల తాలూకు ఫుటేజ్ ని వెంటనే డిలీట్ చేయండి లేదంటే ఖచ్చితంగా చట్టపరంగా చర్యలు తీసుకుంటానని కాస్త సమయం ఇస్తోంది వాళ్ళకు . ఈలోగా మాట విని ఆ కథనాలు డిలీట్ చేస్తారా ? అలాగే ఉంచి తేల్చుకుంటారా ? చూడాలి . బిగ్ బాస్ లో పార్టిసిపేట్ చేయడం వల్ల హాట్ ఇమేజ్ వచ్చింది గీతా మధురి .

English Title : Geetha madhuri warns youtube channels