జెమ్ గా వస్తోన్న విజయ్ రాజ్!


Gem Movie Launch
Gem Movie Launch

ప్రముఖ నటుడు శివాజీ రాజా తనయుడు విజయ్ రాజా హీరోగా నటించిన ఏదైనా జరగొచ్చు చిత్రం ఆగష్ట్ 23న విడుదలవుతోంది. క్రైమ్ థ్రిల్లర్ గా రూపొందిన ఈ చిత్రంలో విజయ్ రాజా యాక్టింగ్ కి మంచి మార్కులే పడ్డాయి.. ఇదిలా ఉండగా విజయ్ రాజా మరో చిత్రంలో బుక్ అయ్యాడు.. నూతన దర్శకుడు సుబ్బు దర్శకత్వంలో ప్రముఖ నిర్మాత కుమారస్వామి నిర్మించే చిత్రంలో విజయ్ రాజా హీరోగా నటిస్తున్నాడు. ఈ చిత్రానికి “జెమ్”టైటిల్ ని కాయం చేసారు చిత్ర యూనిట్.. రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం నవంబర్ లో రిలీజ్ కానుంది.. !