మహానటిని మొండిదానిగా చూపించనున్నారు


gemini ganesan biopic documentary on cards

మహానటి సావిత్రి బయోపిక్ తెలుగునాట సంచలన విజయం సాధిస్తుండటంతో జెమిని గణేశన్ కూతురు కమలా సెల్వరాజ్ ఆగ్రహంగా ఉన్నారు . సావిత్రి ని గొప్పదాని గా చూపించారు కానీ మా నాన్న ని దోషిగా చూపించారని ,సినిమాలు లేక ఖాళీగా ఉన్నట్లు అలాగే మా నాన్న సావిత్రి ని మోసం చేసినట్లుగా …… తాగుడు నేర్పించింది కూడా మా నాన్నే అని వాళ్లకు ఇష్టం వచ్చినట్లుగా చూపించారు కానీ అది నిజం కాదని అంటోంది జెమిని గణేశన్ కూతురు కమల సెల్వరాజ్ .

అంతేకాదు మహానటి చిత్రానికి కౌంటర్ ఇవ్వడానికి రెడీ గా ఉన్నామని అంటోంది . ఇంతకీ కమలా సెల్వరాజ్ మహానటి కి కౌంటర్ ఎలా ఇవ్వనుందో తెలుసా ……. జెమిని గణేశన్ బయోపిక్ అందించడానికి రెడీ అవుతోంది అయితే సినిమా రూపంలో కాకుండా డాక్యుమెంటరీ రూపంలో . ఈ డాక్యుమెంటరీ నిడివి ఒక గంటా యాభై నిమిషాల పాటు ఉంటుందట . దాంట్లో సావిత్రి గురించిన అసలు విషయాలు వెల్లడిస్తారట ! సావిత్రి మంచి మనసున్న వ్యక్తి అయితే అంతకన్నా మహా మొండిఘటం అని అందుకే ఆమె జీవితం అర్దాంతరంగా ముగిసిపోయిందని అంటోంది కమలా సెల్వరాజ్ .