మహానటి టీమ్ పై నిప్పులు చెరిగిన జెమిని గణేశన్ కూతురు


gemini ganesan daughter kamala selvaraj fires on mahanati unit

మహానటి చిత్రంలో మా నాన్న జెమిని గణేశన్ ని విలన్ గా చిత్రీకరించారని , చాలా సన్నివేశాల్లో అవమానించేలా చిత్రీకరించారని మహానటి చిత్ర బృందం పై నిప్పులు చెరుగుతోంది జెమిని గణేశన్ కూతురు కమలా సెల్వరాజ్ . మహానటి చిత్రం బాగుందని సావిత్రి కూతురు విజయ చాముండేశ్వరి , కొడుకు సతీష్ లు సంతృప్తి వ్యక్తం చేయగా జెమిని గణేశన్ కూతురు కమలా సెల్వరాజ్ మాత్రం ఆగ్రహం వ్యక్తం చేస్తోంది . మా నాన్న తమిళనాట తిరుగులేని స్టార్ హీరో అని అతడు సినిమాలు లేక ఖాళీగా ఉన్నట్లు కొన్ని సన్నివేశాల్లో చూపించారని అలాగే సావిత్రి ని బాగా ప్రేమించి పెళ్లి చేసుకున్నట్లు చూపించారని అంటే మా అమ్మ ని ప్రేమించలేదా ? అసలు మొదట పెళ్లి చేసుకుంది మా అమ్మ నే ! అంటే మా అమ్మని ప్రేమించకుండానే పెళ్లి చేసుకున్నాడా ?

అలాగే సావిత్రి కి మద్యం అలవాటు చేసింది మా నాన్న అని చూపించారు అది తప్పు అలాగే ఆమెని సరిగ్గా చూసుకోలేదని కూడా చూపించారు అసలు విషయం మీకు ఏం తెలుసు ? ప్రాప్తం చిత్రం చేయొద్దని ఎంతగానో బ్రతిమిలాడాడని కానీ సావిత్రి అస్సలు వినలేదని పైగా మాపై కుక్క ని వదిలి మమ్మల్ని ఇంటి నుండి గెంటి వేయించారని ఆ సమయంలో నాన్న తో పాటుగా నేను కూడా ఉన్నానని కుక్క ని వదలడంతో మేము గోడ దూకి పారిపోయామని …… ఆ సంఘటన తర్వాత ఘోర అవమానంగా భావించిన మా నాన్న మళ్ళీ సావిత్రి ఇంటికి వెళ్లలేదని స్పష్టం చేసింది కమలా సెల్వరాజ్ . అంతేకాదు మా నాన్న ఎవరినీ ప్రేమించి పెళ్లి చేసుకోలేదని ఎవరైతే మా నాన్న ని ప్రేమించారో వాళ్ళని మాత్రమే పెళ్లి చేసుకున్నాడని సంచలన వ్యాఖ్యలు చేసింది కమలా సెల్వరాజ్ .